చైనా యాప్స్‌ని ఇండియా నిషేధించాక... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... తామెందుకు నిషేధించకూడదు అని అనుకున్నారు. ముఖ్యంగా అమెరికా యువత ఎక్కువగా వాడుతున్న టిక్‌టాక్‌ను ఎందుకు వదిలించుకోకూడదు అనే ఆలోచనకు వచ్చారు. ఈ ప్రక్రియలో టిక్టాక్తోపాటూ... మరికొన్ని యాప్స్‌ని కూడా నిషేధించాలనుకుంటున్నారు. ఇప్పుడు ఆయన దృష్టి... సాఫ్ట్వేర్ కంపెనీలపై పడినట్లు తెలిసింది. చైనాలోని చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు... చైనాలో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నాయి. ఎందుకూ అంటే... కరోనా వైరస్ వల్ల అని చెబుతున్నాయి. చైనాలోని చాలా అమెరికా కంపెనీలు... తమ వాటాలను తక్కువ రేటుగా చైనా కంపెనీలకు అమ్మేసుకుంటున్నాయి. దీనంతటికీ అసలు కారణం... తెరవెనక ట్రంప్ పావులు కదుపుతుండటమే అని తెలిసింది. (credit - twitter)
సడెన్‌గా ట్రంప్... సాఫ్ట్వేర్ కంపెనీలపై ఎందుకు పడ్డారన్న డౌట్ కలగడం సహజం. చైనాలో పెట్టుబడులు పెట్టిన ఈ కంపెనీలు... బీజింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. అమెరికా ప్రజల వ్యక్తిగత వివరాలు, సమాచారాన్ని చైనా కంపెనీలకు ఇస్తున్నాయనీ... తద్వారా తమ జాతీయ భద్రతకు ఇది సవాలుగా మారుతోందని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఆదివారం అన్నారు. (credit - twitter)
ఈ సాఫ్ట్వేర్ కంపెనీల అంశం చర్చకు వచ్చినప్పుడు ట్రంప్ "అయ్యింది చాలు. మనం దీన్ని సరిచేస్తున్నాం" అన్నారని పాంపియో తెలిపారు. అంటే త్వరలో చైనాలో పెట్టుబడులు పెట్టిన అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలతోపాటూ... చైనాకి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోబోతోందని పాంపియో తెలిపారు. కానీ ఇప్పటికే తెరవెనక ఈ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిసింది. (credit - twitter)
రెండేళ్లుగా అమెరికాతో వాణిజ్య యుద్ధానికి దిగి చైనా లేనిపోని వివాదాలను రాజేసుకుంది. అదే సమయంలో కరోనా రావడంతో... ప్రపంచ దేశాలన్నీ చైనాపై గుర్రుగా ఉన్నాయి. దానికి తోడు శాంతి మార్గంలో వెళ్లే ఇండియాని రెచ్చగొట్టి చైనా మరో పెద్ద తప్పు చేసినట్లైంది. డ్రాగన్‌కి కళ్లెం వేస్తూ భారత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు నచ్చుతున్నాయి. అవి కూడా చైనాకి చెక్ పెడుతున్నాయి. ఈ లిస్టులో అమెరికా ముందుంది. (credit - twitter)
ఇక్కడ ట్రంప్‌కి మరో లాభం కూడా ఉంది. చైనాలో పెట్టుబడులను రద్దు చేసుకుంటున్న అమెరికా కంపెనీలు... ఆ డబ్బును అమెరికాలో పెట్టుబడి పెట్టే అవకాశాలుంటాయి. లేదా భారత్ లాంటి దేశాల్లో పెడతాయి. ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి... ప్రస్తుతానికి స్వదేశంలోనే పెట్టుబడులు పెట్టే ఛాన్స్ ఉంటుంది. తద్వారా అమెరికాలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఆ ప్రయోజనం ద్వారా యువత నుంచి తనకు ఓట్లు దక్కేలా చేసుకోవాలని ట్రంప్ వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా చైనాకి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిన సంకేతాలు కనిపిస్తున్నాయి. (credit - twitter)