తాప్సీ ఉపాధ్యాయ్ బీటెక్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత తన వ్యాపారాన్ని ప్రారంభించింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే ఆమె లక్ష్యం, అందుకే ఆమె తన పానీ పూరీ స్టాల్ కోసం గాలిలో వేయించిన పూరీలను సిద్ధం చేస్తుంది. తన స్టాల్‌కి మరిన్ని స్ట్రీట్ ఫుడ్ ఆప్షన్లను జోడించి వాటిని ఆరోగ్యవంతంగా మార్చాలని కోరుకుంటుంది.
ఇటీవల, ఉపాధ్యాయ్ నటించిన ఇన్స్టాగ్రామ్ రీల్ వైరల్ అయ్యింది. @are_you_hungry007 అనే ఇన్స్టాగ్రామ్ పేజీ ద్వారా వీడియో షేర్ చేయబడింది. క్లిప్‌లో ఉపాధ్యాయ్ తన స్టాల్‌ని తెరిచి ఆమె తయారు చేసే రుచికరమైన గప్ చుప్ లను గురించి వివరించి చెప్పింది. అంతే కాకుండా.. తాను ఈ బిజినెస్ ప్రారంభకాలంలో ఎదుర్కొన్న పోరాటాలను కూడా ఆమె ప్రస్తావించారు.