ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టాక.. ఉక్రెయిన్‌లో చనిపోతున్న సామాన్య ప్రజలను చూసిన వారిలో చాలామంది రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ చనిపోతే బాగుండు అనుకుంటున్నారు. ఆయనకు ఏదైనా జబ్బు వచ్చి పోతే బాగుండని కోరుకుంటున్నారు. అలాంటి వారికి ఆనందం కలిగించే వార్తొకటి ఈమధ్య వైరల్ అయ్యింది. (Left image credit - Reuters)
గతవారం పుతిన్.. మాస్కోలోని అధికారిక భవనంలో మెట్లు దిగుతూ జారిపడ్డారనీ.. దాని వల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందనే ప్రచారం జరిగింది. పుతిన్ పొట్ట, మూత్రనాళానికి క్యాన్సర్ సోకడం వల్లే.. ఆయన మెట్లపై జారి.. ఐదు మెట్లపై దొర్లుతూ నేలపై పడ్డారని ప్రచారం జరిగింది. దీంతో ఏప్రిల్ నాటి రిపోర్టుపై మళ్లీ ఇప్పుడు చర్చ జరుగుతోంది.
తాజాగా పుతిన్.. కెర్చ్ స్ట్రైట్‌లో మెర్సీడెజ్ బెంజ్ కారును నడుపుతూ కనిపించారు. క్రిమియన్ బ్రిడ్జిపై కారును నడిపారు. రెండు నెలల కిందట అక్కడ బాంబు దాడి జరిగింది. దాని వెనక హస్తముందని అప్పట్లో పుతిన్ ఆరోపించారు. కారు నడుపుతున్న పుతిన్‌ని చూస్తే.. క్యాన్సర్ సోకిన లక్షణాలేవీ కనిపించలేదు. మరి ఆ రిపోర్టులు, వార్తల్లో నిజమెంత అనేది తెలిసేలా లేదు. (image credit - twitter - @Kremlinpool_RIA)