ఎవరైనా చిన్నపామును చూస్తేనే హడలెత్తి పరుగులు తీస్తారు. అలాంటిది ఏకంగా ఐదు అడుగులు ఉన్న తాచుపాము ఏకంగా పడగవిప్పింది. దానిని చూసిన ఒక మహిళ వెంటనే దగ్గరకంటా వెళ్ళి తన చేతిలో ఉన్న ఒక పొట్లాన్ని చూపించింది.
2/ 5
అంతే ఆ పాము తోకను ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో తలపట్టేసింది. ఇదంతా చూస్తున్నవారు ఉత్కంఠతో ఆ క్షణాలను చూశారు. ఏమి జరుగుతుందోనని కళ్ళును పెద్దవి చేసి మరీ చూశారు.
3/ 5
ఒక మహిళ మాత్రం ఏమాత్రం భయపడకుండా దగ్గరకు వెళ్ళిపోయింది. రోడ్డుపై ఉన్నవారంతా ఎంతో భయంతో ఉత్కంఠతో ఆ మహిళను చూస్తేనే ఉన్నారు. ఆమె మద్యం మత్తులో పామువద్దకు వెళ్తుందేమోనని అందరూ భావించి కేకలు వేశారు.
4/ 5
ఆ మహిళ మాత్రం తన చేతిలో సిద్ధంగా ఉంచుకున్న చిన్న పొట్లాన్ని పాము పడగకు చూపించింది. మరో చేత్తో తోకను పట్టుకుని, ఇంకోచేత్తో తలపట్టుకుని సంచిలో వేసేసుకుంది.
5/ 5
ఇదంతా రెండు నిమిషాల్లో జరిగిపోయింది. మరో యువకుడు కూడా అప్పటికి 12 పాములు పట్టుకుని సంచిలో వేసుకుని వచ్చాడు. వీరంతా రెండురోజుల నుంచి ఈ ప్రాంతంలో నివాసం ఉంటూ తాచుపాములను పడుతున్నట్లుగా చెప్పారు.