Cyclone Nisarga : అరేబియా సముద్రంలో క్రమంగా పెద్దదవుతున్న నిసర్గ తుఫాను... మహారాష్ట్ర, గుజరాత్ పై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. ముఖ్యంగా... సముద్రానికి సమాంతరంగా ఉండే ముంబైను ముంచేలా కనిపిస్తోంది. అటువైపు నైరుతీ రుతుపవనాలు బలంగా ఉన్నాయి.
2/ 7
ఈ తుఫానుతో... భారీ వర్షాలు కురిసే పరిస్థితి కనిపిస్తోంది. బుధవారం మధ్యాహ్నం ఈ తుఫాను తీరం దాటుతుందనే అంచనా ఉంది. ఐతే... ఇప్పటికే కరోనాతో అల్లాడిపోతున్న ముంబైకి తుఫాను ఎంత పెద్ద నష్టం తెస్తుందో అనే టెన్షన్ ఉంది.
3/ 7
ప్రస్తుతం తుఫాను గంటకు 4 కిలోమీటర్ల వేగంతో ఉత్తర దిశగా కదులుతోంది. ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్ తీరం మధ్య హరిహరేశ్వర్ దగ్గర జూన్ 3 మధ్యాహ్నం తర్వాత తీరం దాటుతుందని అంటున్నారు. (credit - Ayaz Ahmad)
4/ 7
ఆల్రెడీ గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. తీరప్రాంతాల్లో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. NDRFకి చెందిన 31 బృందాలు... రెండు రాష్ట్రాల్లో సహాయ చర్యలు చేపడుతున్నాయి. ఒక్కో బృందంలో 45 మంది సభ్యులుంటున్నారు.
5/ 7
తుఫాను తీరం దాటేటప్పుడు గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయనీ... అందువల్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు మరీ మరీ చెబుతున్నారు.
6/ 7
కేంద్ర హోంశాఖ కూడా కంటిన్యూగా తుఫానును గమనిస్తోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలతో టచ్లో ఉంటూ.... సహాయ కార్యక్రమాల్లో తలమునకలైంది. కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు కూడా రంగంలోకి దిగాయి.
7/ 7
జూన్ 4 వరకు భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. సముద్రాల దగ్గరకు ఎవరూ వెళ్లవద్దని కోరుతున్నారు. చేపల వేటకు అస్సలు వెళ్లొద్దని చెప్పారు.