Mandous Photos : మాండస్ తుఫాను బీభత్సం.. తమిళనాడు, దక్షిణ ఏపీ అల్లకల్లోలం
Mandous Photos : మాండస్ తుఫాను బీభత్సం.. తమిళనాడు, దక్షిణ ఏపీ అల్లకల్లోలం
Cyclone Mandous Photos : వాతావరణ అధికారులు హెచ్చరించినట్లే జరిగింది. మాండస్ తుఫాను తమిళనాడుతోపాటూ.. రాయలసీమపై విరుచుకుపడింది. సర్వనాశనం చేసింది. ఆ ఫొటోలు చూస్తేనే మనకు విషయం అర్థమైపోతుంది.
Cyclone Mandous severely affects tamil nadu andhra pradesh with photos nk Cyclone Mandous Photos : వాతావరణ అధికారులు హెచ్చరించినట్లే జరిగింది. మాండస్ తుఫాను తమిళనాడుతోపాటూ.. రాయలసీమపై విరుచుకుపడింది. సర్వనాశనం చేసింది. ఆ ఫొటోలు చూస్తేనే మనకు విషయం అర్థమైపోతుంది.
2/ 33
శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ తుఫాను.. పుదుచ్చేరి, శ్రీహరికోట మధ్య.. మహాబలిపురం దగ్గర్లో తీరం దాటింది.
3/ 33
నిన్న వాయుగుండంగా మారిన తుఫాను.. ప్రస్తుతం మరింత బలహీనపడింది. ఐతే.. ఈలోపే ఇది అల్లకల్లోలం సృష్టించింది.
4/ 33
తీరం దాటే సమయంలో గంటకు 85 కిలోమీటర్ల రాకాసి గాలులు వీయడంతో... భారీ చెట్లు, స్తంభాలు నేలకూలాయి.
5/ 33
చెన్నైలో దాదాపు 200కు పైగా చెట్లు కూలిపోయినట్లు తెలిసింది.
6/ 33
తమిళనాడులో చాలా చోట్ల ఇళ్ల గోడలు కూలిపోయాయి.
7/ 33
కొన్ని చోట్ల వాహనాలపై చెట్లు కూలిపోయాయి.
8/ 33
కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కొట్టుకుపోయాయి.
9/ 33
తమిళనాడులోని చెంగల్పట్టు, విల్లుపురం, కాంచీపురం, కరైకల్తోపాటూ.. పుదుచ్చేరిలో బలమైన గాలులు వీచాయి.
10/ 33
శుక్రవారం నుంచి , పక్కనే ఉన్న కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. శనివారం తమిళనాడు, ఏపీ, ఉత్తర కర్ణాటకలో భారీ వర్షాలు కురిశాయి.
11/ 33
ఫలితంగా లోతుగా ఉండే ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చేసింది. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా రవాణాకు సమస్యలు తప్పట్లేదు.
12/ 33
ప్రస్తుతం చెన్నై తీరం అల్లకల్లోలంగా ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. జాలర్లు మరో రెండ్రోజులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
13/ 33
ఇక ఏపీలోని , , , అన్నమయ్య, జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుఫాను ప్రభావంపై సమీక్షించిన సీఎం వైఎస్ జగన్.. అన్ని రకాల చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
14/ 33
తుఫాను ప్రభావం ఏపీలోని రాయలసీమలో ఎక్కువగా కనిపించగా.. దక్షిణ కోస్తాలో కూడా నిన్న జోరుగా వాన పడింది. ఫలితంగా ఏపీలో నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి.
15/ 33
శ్రీకాళహస్తిలోని స్వర్ణముఖి నదికి పెద్ద ఎత్తున వరద వస్తోంది. అలాగే బాలాయపల్లి మండలం.. కడగుంట వంతెనపై కైవల్య నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. అక్కడ రాకపోకలు ఆగిపోయాయి.
16/ 33
ఇవాళ, రేపు కూడా ఏపీలో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. (image credit - twitter - ANI)
17/ 33
ప్రస్తుతం ఇటు తమిళనాడు, అటు ఏపీలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. (image credit - twitter - ANI)
18/ 33
తమిళనాడులో కొనసాగుతున్న సహాయక చర్యలు.
19/ 33
తమిళనాడులో ఇళ్ల ముందుకు వచ్చేసిన వరద నీరు
20/ 33
తీవ్ర గాలులకు కూలిపోయిన చెట్టు (image credit - twitter - ANI)
21/ 33
తీవ్ర గాలులకు కూలిపోయిన చెట్టు (image credit - twitter - ANI)