హిందువులకు అతి పవిత్రమైనది ఆవు..అందుకే ఆవుని గోమాత అని పిలుస్తారు. గో ప్రేమికులు అందరూ ఫిబ్రవరి 14న కౌ హగ్ డేగా జరుపుకోవాలని కేంద్ర పశు సంక్షేమ బోర్డు పిలుపునిచ్చింది. భారతదేశ సంస్కృతి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు గోవు వెన్నెముక లాంటిదని.. అందుకే ఆవును కామధేనువు, గోమాతగా పేర్కొంటామని తెలిపింది. source GETTYIMAGES
భారతీయులు పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడిపోవడం వల్ల దేశంలో వైదిక సంప్రదాయాలు అంతరించిపోతున్నాయని కేంద్ర పశు సంక్షేమ బోర్డు ఎస్.కె.దత్తా ఆందోళన వ్యక్తం చేశారు. ఆవును కౌగిలించుకుంటే వ్యక్తిగత, సామూహిక ఆనందం పెరుగుతుందని.. ఆవును కామధేను అని, గోమాత అని తల్లిలా పూజిస్తామన్నారు. ఆవుతో కలిగే విస్తృత ప్రయోజనాల దృష్ట్యా గోవులను కౌగిలించుకోవాలని కోరుతున్నామన్నారు.
ఆవును కౌగిలించుకుంటే చాలు ఎన్నో రోగాలు దూరమవుతాయని చాలా మంది విశ్వసిస్తున్నారట. ఆవును కౌగిలించుకోవడం మానుషులకు ఓదార్పు ఇస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఆ ఆవును హగ్ చేసుకునే వ్యక్తి తెలిసి ఉండాలని.. లేకపోతే ఆవు వారిని దగ్గరకు రానిచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. Image source Gulte
సాధారణంగా పసికందులు తల్లి ఒడిలో నిద్రించడం ఎంతో మంచింది. వారు ఆ టైంలో మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉంటారు. అలాగే ఆవును కౌగిలించుకున్నప్పుడు కూడా మనుషులకు ఎంతో రిలాక్సేషన్ వస్తుందని అంటున్నారు. అయితే ఇవన్ని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. అధ్యయనాలు, ప్రజల నమ్మకాలు, కొన్ని సైన్స్ జర్నల్స్ ఆధారంగా ఈ విషయాలను సోషల్మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. Image source Free press journal