రెండెళ్ల క్రితం కరోనా ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఉగ్ర రూపం దాల్చింది. దాదాపు మిలియన్ లకు పైగా జనాలు చనిపోయారు. ఎందరో తల్లులు, తండ్రులు, పిల్లలు, అనాథలుగా మారిపోయారు. కొందరికి ఆస్పత్రులలో బెడ్ లు దొరక్క చనిపోయారు. మరికొందరు వెంటిలేటర్ లు దొరక్క చనిపోయారు. అయితే, కోల్ కతాకు చెందిన అరూప్ ప్రకాష్, పాప్రీ చౌదరీ కూడా కరోనా బారిన పడ్డారు. పాప్రి, అరూప్ రాహకు 28 ఏళ్ల క్రితం పెళ్లజరిగింది. ఆ తర్వాత గతేడాది వీరికి కోవిడ్ సోకింది.
అరూప్ ప్రభుత్వ ఇంజనీర్ గా పనిచేసేవాడు. వీరికి ఒక కూతురు కూడా ఉంది. భర్త బతుకుతాడని ఎంతో ఆశపడింది. ప్రతి రోజు భర్తను చూసేందుకు వచ్చేది. కానీ ఆస్పత్రి సిబ్బంది ఆమెను దగ్గరకు వెళ్ల నిచ్చేవారు కాదు. ఆసమయంలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఎక్కడ చూసిన వైరస్ వ్యాప్తి, మరణాలు పేపర్ లలో ఆమె చూస్తుంది. ఇది మన దేశంలో సంభవించిన పెద్ద విపత్తుగా భావించవచ్చు. మిలియన్ ల మంది తమ ప్రాణాలను కోల్పోయారు.
ఒకప్పుడు ఆమె నాస్తికురాలిగా ఉండేది. కానీ ప్రస్తుతం ఆమె ఆధ్యాత్మికత వైపు మళ్లింది. మరణానంతర జీవితాన్ని విశ్వసించింది. ఆమె అనేక కష్ట నష్టాలను చవిచూసింది.
పాప్రి తన నిత్యం తన భర్త ను గుర్తుచేసుకుంటునే ఉంటుంది. తనకు ఇష్టమైన ఆహారం తినడం, కుటుంబ కార్యక్రమాలకు వెళ్లడం మానేసింది. ఆమె తన భర్త చితాభస్మాన్ని లాకెట్టులో ధరించింది. ఆమె షవర్లో ఏడుస్తూ, "నన్ను చివరిసారి కౌగిలించుకోమని అడుగుతానని" అని చెప్పి ఏడ్చింది.
మహామ్మారి పేద, ధనిక, డబ్బులున్న వారు లేని వారు.. అనే తేడా లేకుండా అందరికి వ్యాపించింది. రాజకీయ నాయకులు, వీఐపీలు, సెలబ్రీటీలు.. ఇలా ప్రతి ఒక్కరు వైరస్ బారిన పడ్డారు. చూస్తుండగానే కళ్లముందే వైరస్ సోకిన వారు ప్రాణాలు కోల్పోయారు. డబ్బులున్న, ఏంచేయలేని పరిస్థితి నెలకొంది. వైరస్ కు సరియైన మందు కూడా అప్పట్లో అందుబాటులో రాలేదు. పాప్రి భర్త దూరం అయినప్పటి నుంచి అతని తీవ్రమైన శోకంలో మునిగిపోయింది.