Coronavirus: కరోనా వైరస్ పుట్టుక, వ్యాప్తికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వందల కొద్దీ పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిలో ఆస్ట్రేలియాకి సంబంధించిన ఓ పరిశోధన షాకింగ్ విషయం చెప్పింది. ఎప్పుడో 20 వేల సంవత్సరాల కిందటే... అప్పటి మానవులకు కరోనా సోకిందని తేలింది. అప్పట్లోనే తూర్పు ఆసియా ప్రాంతాల్లో అది విస్తరించింది. అంటే... ఇప్పుడు మనం చెప్పుకుంటున్న చైనా, జపాన్, వియత్నాం ఉన్న ప్రాంతాల్లోనే... అప్పట్లో కరోనా వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ ప్రాంతాల్లో కరోనా లాంటి చాలా వైరస్లు వస్తూనే ఉండటాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అంటే కరోనా ఇప్పటిది కాదు... పురాతనమైనదని అర్థమవుతోంది. (image credit - NIAID)
20 వేల ఏళ్లంటే... అప్పట్లో అసలు మానవులకు టెక్నాలజీయే లేనట్లు లెక్క. మందులు లేవు, వ్యాక్సిన్లూ లేవు. కానీ... అప్పటి మానవుల్లో కూడా వ్యాధి నిరోధక శక్తి ఉంది. అప్పటి ప్రజలు... కరోనా సోకినప్పుడు... మంచానపడినా... చాలా మంది దాన్ని విజయవంతంగా గెలిచారు. అలా గెలిచినప్పుడు వారి జన్యువుల్లో కొన్ని మార్పులు వచ్చాయి. ఆ మార్పులు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. తాజాగా చైనా, జపాన్, వియత్నాంలోని ప్రజల DNAని పరిశోధించినప్పుడు... ఈ జన్యు మార్పులు వారిలో కనిపిస్తున్నాయి. ఈ విషయాల్ని ఆస్ట్రేలియా నేషనల్ యూనివర్శిటీ పరిశోధకులు తెలిపారు. (image credit - NIAID)
నిజానికి కరోనా అనేది ఒక్క వైరస్ కాదు. ఇది అనేక రకాల కరోనా జాతికి చెందిన వైరస్ల గుంపు. ఇదివరకు వచ్చిన సార్స్, మెర్స్ వంటివి ఇందులో భాగమే. వీటిలో ఏవి వచ్చినా మనం ముక్కు, నోటికి మాస్క్ వాడాల్సి ఉంటుంది. ఈ భూమిపై మనిషి కంటే ముందే వైరస్లు పుట్టాయి. వాటితో ఆదిమానవుల నుంచి ఇప్పటివరకూ పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. ఆది మానవులు పుట్టిన ఆఫ్రికాలో అంతుబట్టని వైరస్లు చాలా ఉన్నాయి. ఈమధ్యకాలంలో ఎబోలా ఎలా విస్తరించిందో మనకు తెలుసు. (image credit - NIAID)
వేర్వేరు వైరస్లు మనిషిపై దాడిచేసినప్పుడల్లా... మనిషిలోని వ్యాధి నిరోధకతలో మార్పులు జరుగుతూ వచ్చాయి. జన్యుమార్పులు వచ్చాయి. ఈ మార్పుల సమాచారం DNAలో లభిస్తుంది. అందువల్లే 20వేల ఏళ్ల కిందటే కరోనా వచ్చినట్లు తేల్చగలిగారు. ఐతే... ఎన్ని వైరస్లు దాడి చేస్తున్నా... మనిషి తన పోరాటం సాగిస్తూనే ఉన్నాడు. డైనోసార్ల లాగా పూర్తిగా అంతరించిపోలేదు. (image credit - NIAID)
వైరస్లు సొంతంగా వృద్ధి చెందలేవు. వాటికి కణాలే ఆధారం. ఆ కణాలు జంతువులవి, పక్షులవి లేదా మనుషులవి... ఏవైనా ఎంచుకుంటాయి. ఈ కణాలకు అతుక్కున్న తర్వాత... కణాన్ని తమ కంట్రోల్ లోకి తెచ్చుకుంటాయి. కణంలో ఉత్పత్తి అయ్యే ప్రోటీన్లను వైరస్లు తీసుకుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో మనిషిలో జన్యుపరమైన మార్పులు వస్తాయి. వాటిని వేల ఏళ్ల తర్వాత కూడా గుర్తించవచ్చు. (image credit - NIAID)
ఇప్పుడున్న టెక్నాలజీతో పాత కరోనాలను గుర్తించేందుకు ప్రయత్నించారు. 2,500 మంది నుంచి జీన్స్ (జన్యువులు) సేకరించి... పరిశీలించారు. 42 రకాల జన్యువుల్లో మార్పుల్ని గుర్తించారు. మొత్తంగా ఆసియాలోనే కరోనా జాతి వైరస్‌లన్నీ పుడుతున్నాయి. అన్నీ చైనా, జపాన్, హాంకాంగ్ లాంటి దేశాల నుంచే వస్తున్నాయి. (image credit - NIAID)