తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్లైన్ వెబ్సైట్లు, గోవిందం యాప్ ద్వారా హుండీకి కానుకల్ని ఆన్లైన్లో డిపాజిట్ చేస్తున్నారు భక్తులు. గత సంవత్సరం ఏప్రిల్లో ఆన్లైన్ హిండీ ఆదాయం రూ.90 లక్షల దాకా వచ్చింది. ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి... కచ్చితంగా అది పడిపోతుందని టీటీడీ పాలక మండలి అనుకుంది. తీరా చూస్తే... ఇప్పుడు కూడా ఏప్రిల్లో అంతే మొత్తం ఆన్లైన్లో వచ్చింది.
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందని ఈమధ్యే టీటీడీ పాలక మండలి సభ్యులు ప్రకటించారు. బ్యాంకులలో డిపాజిట్ మనీని జీతాల కోసం వాడలేమనీ... రోజువారీ వచ్చే హుండీ ఆదాయాల్లోనే అవన్నీ సెట్ చెయ్యాల్సి ఉంటుందని తెలిపారు. హుండీ ఆదాయం పడిపోవడంతో... ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం ఇబ్బందిగా మారిందని తెలిపారు.
ప్రస్తుతం టీటీడీ మే 31 వరకూ మూసి ఉంచుతారని తెలిసింది. ఆ తర్వాత... భక్తులను అనుమతించి... తప్పనిసరిగా సోషల్ డిస్టాన్స్ పాటించేలా చెయ్యాలని పాలక మండలి సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం... క్యూ లైన్లలో... ప్రత్యేక ప్లాస్టిక్ రిబ్బన్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు ఆయా లైన్లలోనే నిలబడి... శ్రీవారి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది.