శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య రామాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా.. రామాలయ నిర్మాణం ఎంతవరకూ వచ్చిందో న్యూస్18 పరిశీలించింది. ఓ వైపు అయోధ్యలో ఆలయాన్ని నిర్మిస్తుండగా, మరోవైపు తాత్కాలిక ఆలయంలో బాల రాముడి చివరి జయంతిని చారిత్రాత్మకంగా జరిపారు. రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది.