కంప్యూటర్ మీద పని చేసే వాళ్లు తమ టైమ్ అయిపోయినా.. ఇంకా పని చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్లకు మీ షిఫ్ట్ టైం అయిపోయింది ఇక ఇంటికెళ్లండి అని మీ కంప్యూటర్ చెబితే ఎలా ఉంటుంది ? మన పక్కన ఉన్నవాళ్లు ఇలాంటి విషయాలు చెబుతారు తప్ప కంప్యూటర్ మాత్రం ఇలాంటివి చెప్పవు. అలాంటి అలర్ట్స్ పెట్టుకుందామంటే కంపెనీలు కూడా ఒప్పుకోవు. (ప్రతీకాత్మక చిత్రం)
కానీ మనం పనిచేసే కంపెనీలే ఇలాంటి మేసేజ్లు మనకు కంప్యూటర్ ద్వారా అందిస్తే ఎలా ఉంటుంది ? వినడానికి వింతగా ఉన్నా.. ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఈ పద్ధతే అమలవుతోంది. అదెక్కడ అంటే ఇండోర్ కి చెందిన సాఫ్ట్ గ్రిడ్ కంప్యూటర్స్. కొన్ని సార్లు ఆఫీస్ అవర్స్ ముగిసినా.. వర్క్ పెండింగ్ లేదా ఏదో ఆలోచిస్తూ అక్కడే కూర్చుండిపోతాం.(ప్రతీకాత్మక చిత్రం)
అలా కేటాయించిన టైం కన్నా ఎక్కువ సమయం ఆఫీస్ లోనే గడిపేస్తూ ఉంటాం. అలాంటి సమయాల్లో ఈ కంపెనీ ఉద్యోగుల డెస్క్ టాప్ స్ర్కీన్ పై ఓ మెసేజ్ వచ్చేలా ఏర్పాటు చేసింది. ఈ కంపెనీలో షిఫ్ట్ టైం అయిపోగానే “మీ షిఫ్ట్ ముగిసింది. దయచేసి ఇంటికి వెళ్లండి" అనే ఓ మెసేజ్ డెస్క్ టాప్ పై కనిపిస్తుంది.(ప్రతీకాత్మక చిత్రం)
తమ కంపెనీ గంటల తరబడి పని చేయనివ్వదని ఉద్యోగులు వెల్లడించారు. దాని వల్ల ఉద్యోగులు ఒత్తిడి లేకుండా మరింత ఉత్సాహంతో పని చేస్తారన్నారు. దాంతో పాటు తమ కంపెనీలో ఉద్యోగుల డెస్క్ టాప్ పై వచ్చే మెసేజ్ తో కూడిన పిక్ ను కూడా ఆమె షేర్ చేశారు. ఈ పోస్ట్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం)