Home » photogallery » trending » CHINESE WOMAN TRIES TO EAT LIVE OCTOPUS BUT IT COUNTERACT PICS BS

PICS: చుక్కలు చూపించిన ఆక్టోపస్.. గిల గిల కొట్టుకున్న యువతి

ఆక్టోపస్ బతికి ఉండగానే దాన్ని తినేయాలనుకుంది ఓ యువతి.. దానివల్ల బోలెడు కామెంట్లు వస్తాయని ఆశపడింది. వీడియో లైవ్ పెట్టి మరీ కెమెరా ముందుకు వచ్చి ఆక్టోపస్‌ను తినేందుకు నోరు తెరిచింది. కానీ, ఆమెకు ఆ ఆక్టోపస్ చుక్కలు చూపించింది. దాని కాలును నోటిలో పెట్టుకోగానే ఆక్టోపస్ తన మిగతా కాళ్లతో ఆమె చెంపను, కంటిని గట్టిగా పట్టుకుంది. దీంతో ఆ యువతి దాన్ని విడిపించుకోడానికి చాలా కష్టపడింది. నొప్పి భరించలేక ఏడ్చేసింది కూడా. ఎట్టకేలకు కష్టపడి లాగేసినా.. ఆక్టోపస్ మాత్రం నెత్తురు కళ్లజూసింది .