BUENOS AIRES : మలేసియా పెట్రోనాస్ టవర్స్ సహా... ఎన్నో అద్భుతమైన ఆర్కిటెక్చర్ నిర్మాణాల్ని సృష్టించిన సెసార్ పెల్లి... 92 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.
మలేసియా అనగానే ఎవరికైనా గుర్తొచ్చేవి పెట్రోనాస్ జంట టవర్లే. అంతలా ఆ దేశానికి గుర్తింపు తెచ్చిన టవర్లతోపాటూ... ఎన్నో ఇంజినీరింగ్ అద్భుతాల్ని సృష్టించిన సెసార్ పెల్లి.. 92 ఏళ్ల వయసులో కన్నుమూసినట్లు అధికారులు తెలిపారు.
2/ 9
అర్జెంటినాలో పెరిగిన పెల్లి... ఆర్కిటెక్చర్ చదువుకున్నారు. విశాలతత్వంతో ఆలోచించే ఆయన... భవిష్యత్ దృక్పథంతో అమెరికా వెళ్లి... అక్కడ తన స్టూడియోను ఏర్పాటుచేశారు.
3/ 9
పెల్లి మరణం తమను ఎంతో బాధించిందని అర్జెంటినా తుకుమాన్ ప్రావిన్స్ గవర్నర్ జువాన్ మంజూర్ తెలిపారు. పెల్లి కుటుంబం, స్నేహితులు, ఆర్కిటెక్చర్ టీం అందరికీ తన సానుభూతి తెలుపుతున్నానని అన్నారు.
4/ 9
1977లో పెల్లి... యాలె యూనివర్శిటీకి చెందిన స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌కి డీన్ అయ్యారు. అదే సమయంలో సెసార్ పెల్లి అండ్ అసోసియేట్స్‌ని స్థాపించారు.
5/ 9
తన కనెక్టికట్‌లోని స్టూడియో పేరును పెల్లి క్లార్క్ పెల్లి గా మార్చుకొని... న్యూయార్క్, అబుదాబీ, శాన్ఫ్రాన్సిస్కో, టోక్యో, షాంఘైలలో ఆఫీస్‌లు తెరిచారు.
6/ 9
పెట్రోనాస్ టవర్స్తోపాటూ పెల్లి... న్యూయార్క్‌లోని వరల్డ్ ఫైనాన్షియల్ సెంటర్, లండన్‌లోని కానరీ వార్ఫ్ టవర్ కూడా నిర్మించారు.
7/ 9
న్యూయార్క్‌లోని మోడ్రన్ ఆర్ట్ మ్యూజియంను ఆధునీకరించారు. ఇంకా మరెన్నో భవనాల్ని ఆయన టీం వర్క్‌తో నిర్మించారు.
8/ 9
అర్జెంటినా చమురు సంస్థ YPF ప్రధాన కార్యాలయం బ్యూనస్ ఎయిర్స్లో ఉంది. దాన్ని డిజైన్ చేసింది పెల్లియే.
9/ 9
పెల్లి... అర్జెంటినాలో, ప్రపంచంలో తన మార్క్ వర్క్‌తో అద్భుతాలు సృష్టించారని YPF ప్రశంసిస్తూ... సంతాపం తెలిపింది.