Viral News : ఆ నటుడే ప్రపంచంలోకెల్లా అత్యంత అందగాడు .. ఎలా నిర్ధారించారో తెలుసా..?
Viral News : ఆ నటుడే ప్రపంచంలోకెల్లా అత్యంత అందగాడు .. ఎలా నిర్ధారించారో తెలుసా..?
World beauty: అతను నిన్నటి వరకు ఓ నటుడు. కాని ఇప్పుడు ప్రపంచంలోకెల్లా అత్యంత అందమైన వ్యక్తిగా నిలిచాడు. ఇన్ని వందల కోట్ల మందిలో ఆ అందగాడు ఎవరూ..?అతనే హ్యాండ్సమ్ అని ఎలా గుర్తించారో తెలిస్తే షాక్ అవుతారు.
ఎదుటి మనిషిలో మన చూపును ఆకర్షించే లక్షణం ఉంటేనే వాళ్లు అందంగా ఉన్నారని అంటారు. ఒక వ్యక్తిని చాలా అందంగా ఉన్నాడని చెప్పడానికి అతని చర్మం రంగు, ఎత్తు, బరువు, వేసుకున్న దుస్తులు కాదంటున్నారు శాస్త్రవేత్తలు.(Photo:Instagram)
2/ 8
అవును ఓ వ్యక్తి ముఖ కవళికల ద్వారానే అతను ఎంత అందగాడో నిర్ణయించవచ్చు అంటున్నారు. ఒక ఊరు, ప్రాంతం కాకుండా ప్రపంచలోనే అత్యంత అందగాడిని గుర్తించాలంటే ఎంత కష్టమో తెలుసా..? అసలు ప్రపంచ అందగాడు ఎలా ఉంటాడు..?(Photo:Instagram)
3/ 8
పది మందిలో అందంగా ఉన్న ఒకర్ని గుర్తించడం చాలా సులువు. కాని కోట్లాది జనాభాలో ఓ బ్రిటన్ యాక్టర్ ప్రపంచ అందగాడు అనే గుర్తింపు దక్కించుకున్నాడు. రెగె జీన్పేజ్ను సైంటిస్టులు అన్నీ రకాల ముఖ కవళికల పరీక్షలు చేసి అతడే ప్రపంచ అందగాడిగా ముద్రవేశారు. (Photo:Instagram)
4/ 8
బ్రిటీష్ నటుడు రెగె జీన్పేజ్ను ప్రపంచంలోకెల్లా అత్యంత అందగాడిని గుర్తించడానికి శాస్త్రవేత్తలు ఫేస్ మ్యాపింగ్ విధానాన్ని అవలంభించారు. ఈ ప్రాసెస్‌లో గ్రీన్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ షైని గుర్తించడం జరిగింది. (Photo:Instagram)
5/ 8
బ్రిటన్‌కు చెందిన కాస్మొటిక్ సర్జన్ డాక్టర్ జూలియన్ డి సిల్వా కంప్యూటరైజ్డ్ బ్యూటీ ఫై మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా నటుడు రెగె జీన్ వరల్డ్‌లోనే టాప్ మోస్ట్ అందగాడిగా గుర్తించారు. ఇదెలా సాధ్యమంటే అందుకు ముఖ కవళికలను సంబంధించిన కొలతల్ని పరిశీలించినట్లుగా తెలిపారు. (Photo:Instagram)
6/ 8
బ్యూటి ఫై మ్యాపింగ్ ప్రక్రియ ద్వారా జీన్ పేజ్ కళ్లు, ముక్కు, కనుబొమలు, పెదాలు, దవడ, ముఖం షేప్‌ను బట్టి అంచనా వేశారు. ఈ విదేశీ నటుడి ముఖం అందాన్ని కొలిచే లెక్కల ప్రకారం 93.65 శాతం పర్ఫెక్ట్గా ఉన్నట్లు తేల్చారు. (Photo:Instagram)
7/ 8
జీన్ తర్వాత స్థానంలో థోర్ సినిమా నటుడు క్రిస్ హెమ్స్‌వర్త్ 93.53 శాతంతో ప్రపంచంలోనే రెండో అందగాడిగా నిలిచాడు. ఇక బ్లాక్ పాంథర్ నటుడు మిఖాయెల్ బి జోర్డాన్ 93.46 శాతం, సింగర్ హ్యారీ స్టైల్ 92.30 శాతంతో వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు.(Photo:Instagram)
8/ 8
సంప్రదాయ ఫేస్ మ్యాపింగ్ పద్ధతి గ్రీన్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ ఫైని ఉపయోగించి ఈ విషయాన్ని తేల్చారు. ఈ విధానంతో ఓ వ్యక్తి ముఖం ఎంత పరిపూర్ణంగా ఉందో లెక్కకట్టవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు.(Photo:Instagram)