పెళ్లిళ్లు స్వర్గాన నిర్ణయించబడతాయని పెద్దలు అంటారు. కాని బీహార్‌లో ఓ యువతి పెళ్లి జైలులో నిర్ణయించబడింది. ఇది నిజం. గోపాల్‌గంజ్‌లోని చనావే జైలు నుంచి నాలుగు గంటల పాటు పెరోల్‌పై వచ్చిన ఓ ఖైదీ తావే దుర్గా ఆలయంలో వేద మంత్రోచ్ఛరణల మధ్య యువతి మెడలో మూడు ముళ్లు వేశాడు. పెళ్లి కూతురు మేజర్ కావడంతో పెళ్లి చేసుకునేందుకు కోర్టు 4గంటల పెరోల్ బెయిల్ మంజూరు చేసింది. పెళ్లి కూతురు మేజర్ కావడంతో కోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ విషయం రెండు కుటుంబాలకు తెలిసింది. అప్పుడు ఇద్దరి కుటుంబాలు అబ్బాయికి, అమ్మాయికి పెళ్లి చేయడానికి అంగీకరించాయి. గోపాల్‌గంజ్‌లోని CJM కోర్టులో కుటుంబం తరపున ఒక దరఖాస్తు దాఖలు చేయబడింది. ఇద్దరూ మేజర్లు కావడంతో కోర్టు పెళ్లికి అనుమతి ఇచ్చింది. ఇందుకోసం ఆ అబ్బాయి పెళ్లికొడుకుగా మారేందుకు నాలుగు గంటల పాటు పెరోల్ బెయిల్ పొందాడు.
ఇప్పుడు పెద్దల ఇష్టపూర్వకంగా వివాహం చేసుకొని దంపతులుగా మారిన రాహుల్, కాజల్‌ను కాపురం పెట్టేందుకు ఓ న్యాయవాది ద్వారా కోర్టులో వివాహ ధృవీకరణ పత్రం కోసం ప్రయత్నిస్తున్నారు. రాహుల్‌కుమార్‌ను విడుదల చేసి ప్రేమికుల కాపురం నిలబెట్టమని కోర్టుకు విజ్ఞప్తి చేస్తామని అబ్బాయి, అమ్మాయి బంధువులు చెబుతున్నారు.