కరీనా కపూర్.. ఈ బ్యూటీకి ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 2012లో సైఫ్ అలీ ఖాన్ ను పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఈ ఏడాది ఫిబ్రవరిలో తమ రెండవ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డకు సంబంధించిన ఫోటోను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖాన్ని కవర్ చేస్తూ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో ఆ బిడ్డ ఫోటో చూడాలని అందరిలో ఆత్రుత మొదలైంది. ఎట్టకేలకు కరీనా తండ్రి, ప్రముఖ నటుడు రణధీర్ కపూర్ తన ఇన్స్టాగ్రామ్లో ఫోటోను షేర్ చేశాడు. నిన్న రణధీర్ కపూర్ ఇన్స్టాగ్రామ్లో ఇద్దరు పక్క పక్కనే ఉన్న ఇద్దరు శిశువుల క్లోజప్ ఫోటోను షేర్ చెయ్యగా అందులో ఒకరు తైమూర్ లాగా కనిపించగా మరొక బిడ్డ బెబోకు రెండవ బిడ్డ.
ఆ ఫొటోలో ఇద్దరు చిన్నారులు ఒకేలా కనిపించరు.. కానీ ఏమైందో తెలియదు కానీ ఆ ఫోటోను కాసేపటికే రణధీర్ కపూర్ డిలేట్ చేశారు. దీంతో అందరూ ఆ ఫొటోలో ఉన్నది ఎవరు అన్న ఆలోచనలో ఉన్నారు. కాగా కరీనా రెండొవ బేబీ అచ్చం అన్నయ్య తైమూర్ లాగా కనిపిస్తున్నాడు అని గతంలో ఓసారి చెప్పారు. ఇప్పుడు రెండో బేబీ అలాగే కనిపించడంతో కరీనా రెండో బిడ్డే అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.