BOLLYWOOD ACTRESS MAHIE GILL AND PUNJABI ACTOR HOBBY DHALIWAL JOINS BJP AHEAD OF PUNJAB ELECTION 2022 MKS
Mahie Gill: మెస్మరైజింగ్ బ్యూటీ మహీ గిల్ పొలిటికల్ ఇన్నింగ్స్.. టార్గెట్ కూడా చెప్పేసిందిగా..
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గ్లామర్ క్వీన్స్ హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తరఫున ‘బికినీ గర్ల్’ అర్చనా గౌతం బరిలోకి దిగగా, పంజాబ్ లో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు మెస్మరైజింగ్ స్టార్ మహీ గిల్. రాజకీయాల్లో తన టార్టెట్ ఏంటో కూడా ఫిక్సయ్యానని చెప్పారామె. వివరాలివే..
అనురాగ్ కశ్యప్ ‘దేవ్ డీ’ సహా పలు బాలీవుడ్ సినిమాల్లో రాణించి, అటు పంజాబీ సినిమాల్లోనూ మంచి పేరు కొట్టేసిన నటి మహీ గిల్ పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు.
2/ 11
పంజాబీ నటుడు, గాయకుడు హాబీ ధాలివాల్‌తో కలిసి మహిగిల్ సోమవారం నాడు కాషాయతీర్థం పుచ్చుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీరి చేరికతో బీజేపీకి గ్లామర్ తోడైనట్లయింది.
3/ 11
చండీగఢ్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, కేంద్ర మంత్రి, పంజాబ్ ఇంచార్జ్ గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్ సమక్షంలో మహీ గిల్ బీజేపీలో చేరారు.
4/ 11
‘మహిళలు ప్రత్యేకించి బాలికల కోసం ఏదైనా చేయాలనే తలంపు చాలా కాలంగా ఉంది. అమ్మాయిలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నాకొక మాధ్యమం లభించింది’అని మహీ గిల్ తన టార్గెట్ ఏంటో చెప్పేశారు.
5/ 11
పాలనలో పంజాబ్ ఎన్నెన్నో అవకాశాలను కోల్పోతున్నదని, రాష్ట్రంలో బీజేపీని నిలబెట్టడమే ధ్యేయమని మహీ గిల్ తోపాటు చేరిన పంజాబీ నటుడు హాబీ ధలీవాల్ అన్నారు.
6/ 11
చాలా కాలంగా బాలీవుడ్ లో అండర్ రేటెడ్ హీరోయిన్ గా కొనసాగుతోన్న మహీ గిల్.. సాహెబ్, బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్, దేవ్ డి, దుర్గమతి, పన్ సింగ్ తోమర్, దబాంగ్, గులాల్ వంటి సినిమాల్లో వెండితెరపై కనిపించారు.
7/ 11
నిజానికి మహీ గిల్ మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ నేతలతో చనువుగా వ్యవహరించేది. గతేడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి హర్ మొహిందర్ సింగ్ లక్కీ తరఫున మహీ ప్రచారం కూడా చేసింది.
8/ 11
లక్కీ తన చిన్ననాటి స్నేహితుడని, అందుకే పార్టీలను పట్టించుకోకుండా అతని కోసం ఎన్నికల ప్రచారం చేశానని నటి మహీ గిల్ అప్పట్లోనే క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, అసలు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనేదీ లేదని కూడా సెలవిచ్చారు. తీరా..
9/ 11
పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల తంతు మొదలైనప్పటి నుంచీ మహీ పొలిటికల్ ఎంట్రీపై కథనాలు వచ్చాయి. కాంగ్రెస్ నేతలతో దోస్తీ కారణంగా ఆమె కూడా ఆ పార్టీలోకే వెళ్లొచ్చనే ఊహాగానాలు వచ్చాయి. కానీ చివరికి బీజేపీలో చేరారామె.
10/ 11
మొత్తంగా పంజాబ్ ఎన్నికల్లో మహీ గిల్ హాట్ టాపిక్ గా నిలిచారు. పంజాబ్ లో సుదీర్ఘ కాలం కలిసుండి, సాగు చట్టాల ఉద్యమం సమయంలో విడిపోయిన అకాలీదళ్, బీజేపీలు ఎన్నికల తర్వాత అవసరాన్ని బట్టి పొత్తు పెట్టుకుంటాయనే ఊహాగానాలను కేంద్ర మంత్రి హర్దీప్ పూరి తోసిపుచ్చారు.
11/ 11
మొత్తం 117 స్థానాలున్న పంజాబ్ అసెంబ్లీకి ఈనెల 20న పోలింగ్ జరుగనుంది. ఈ మేరకు ఇప్పటికే ఈసీ ఏర్పాట్లను ముమ్మరం చేసింది. మార్చి 10న మిగతా నాలుగు రాష్ట్రాలతో కలిపి పంజాబ్ ఫలితాలు వెల్లడవుతాయి. మహీ రాక బీజేపీకి ఏమేరకు కలిసొస్తుందో చూడాలిమరి.