ఎగర్ గివెన్ అనే భారీ నౌక సూయజ్ కాలువను బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. కాల్వకు అడ్డంగా నిలిచిపోవడంతో సరుకు రవాణా స్తంభించిపోయింది. ఐతే అచ్చం అలాంటి ఘటనే.. అమెరికాలో రోడ్డుపై జరిగింది. హైవేపై ఓ పడవ రోడ్డుప్రమాదానికి గురయింది.
1/ 7

2/ 7
ఫ్లోరిడాలోని క్రెస్ట్ క్రూ ప్రాంతంలో ఇంటర్‌స్టేట్ హైవేపై ..రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి.
3/ 7
మార్చి 25న రాత్రి 8 గంటల సమయంలో ఓ ట్రక్కు పడవను తీసుకెళ్లింది. ట్రయలర్పై పడవను ఉంచి దాన్ని ట్రక్కుకు కట్టి లాక్కెళ్లారు. ఐతే క్రెస్ట్వ్యూ సమీపంలో అది ట్రక్కు నుంచి విడిపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.
4/ 7
క్రెస్ట్వ్యూ ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని.. దాదాపు 3 గంటల పాటు శ్రమించి ఆ పడవను అక్కడి నుంచి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెప్పారు.
5/ 7
ఐతే ఈ పడవ ప్రమాదాన్ని నెటిజన్లు సూయజ్ కాల్వలో చిక్కుకుపోయిన ఎవర్‌గివెన్ షిప్‌తో పోల్చుతున్నారు. అక్కడ ఆ పడవ సూయజ్ కాల్వను బ్లాక్ చేస్తే.. ఇక్కడ ఈ పడవ హైవేను బ్లాక్ చేసిందని జోకులు పేల్చుతున్నారు.
6/ 7
పడవలకు ఏదో జరిగింది? అందుకే ఇలా రవాణా వ్యవస్థను స్తంభింప జేస్తున్నాయని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.