బీహర్ లో 2020లో ఒక షాకింగ్ సంఘటన జరిగింది. చౌముఖ గ్రామానికి చెందిన నీరజ్, అతని సోదరుడు ధీరజ్ తమ గేదెలకు స్నానం చేయడానికి గండక్ నదికి వెళ్లారు. కొంత దూరంలో, ఇద్దరూ వేర్వేరు గేదెలకు స్నానం చేస్తున్నారు. ఆ సమయంలో 8 అడుగుల పొడవున్న మొసలి నీటిలో ఉండటం ఎవరికీ తెలియలేదు. అప్పుడు హఠాత్తుగా శబ్దం వచ్చింది.
మొసలి ఒక్కసారిగా తమ్ముడు... ధీరజ్ పైకి దాడిచేసింది. అంతే కాకుండా.. అతడిని నీళ్లలోనికి బలంగా లాక్కొని వెళ్తుంది. అక్కడున్నవారంతా.. భయంతో దూరంగా వెళ్లిపోయారు. దీని తరువాత, ధీరజ్ ఏమీ ఆలోచించకుండా తన సోదరుడి వైపు దూకి, అతనిని ఒక వైపు నుండి బయటకు తీయడం ప్రారంభించాడు. అక్కడ ఉన్న కర్రతో మొసలిపైకి దాడిచేశాడు.
ఈ క్రమంలో తాజాగా, ధీరజ్ చూపిన తెగువకు ప్రభుత్వం సత్కరించింది. డే సందర్భంగా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్, యోగపట్టి బ్లాక్‌లోని చౌముఖ గ్రామానికి చెందిన 16 ఏళ్ల ధీరజ్‌ను పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రధాన మంత్రి జాతీయ బాల అవార్డుతో సత్కరించారు. అతని చదువుల కోసం ల్యాప్‌టాప్, , బ్యాగ్, స్మార్ట్ వాచ్ కూడా ఇచ్చారు. అంతే కాకుండా.. అతని ధైర్యసాహసాలకు, గత ఏడాది జనవరి 24న, ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఆయనను పీఎం నేషనల్ చైల్డ్ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే.