ప్రముఖ అమెరికన్ వ్యాపారవేత్త, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) లింగమార్పిడి కూతురు పేరు మార్చుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. 18 ఏళ్ల జేవియర్ తన లింగాన్ని మార్చుకున్న తర్వాత తన పేరును వివియన్ జెన్నా విల్సన్‌గా మార్చుకున్నాడు. ఇప్పుడు ఆమె తన పేరును లీగల్ డాక్యుమెంట్లలో కూడా మార్చాలని .. కొత్త జనన ధృవీకరణ పత్రాన్ని జారీ చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
జెన్నా విల్సన్ డిమాండ్‌ను అంగీకరించిన కోర్టు పేరు మార్చుకునేందుకు అనుమతి ఇచ్చింది. జేవియర్‌కు త్వరలో కొత్త జనన ధృవీకరణ పత్రం జారీ చేస్తామని కోర్టు తెలిపింది. గే తన తండ్రితో ఉన్న సంబంధాన్ని కూడా తెంచుకోనున్నట్లు తెలుస్తోంది. జేవియర్ తన తండ్రితో అన్ని సంబంధాలను ముగించాలని కూడా మాట్లాడినట్లు పిటిషన్లో పేర్కొంది.
2008లో ఎలాన్ మస్క్ మాజీ భార్య జస్టిస్ విల్సన్‌తో విడాకులు తీసుకున్నారు. వీరికి జేవియర్ అలెగ్జాండర్, గ్రిఫ్ఫిన్ అనే ఇద్దరు కుమారులున్నారు. అందులో జేవియర్ అలెగ్జాండర్ కొంతకాలం కిందట అమ్మాయిగా లింగమార్పిడి చేసుకున్నారు. ప్రస్తుతం ఆమెకు 18 ఏళ్లు నిండాయి. దీంతో తన పేరును కూడా మార్చుకుని కొత్త జనన ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలని అమెరికా శాంటా మోనికాలోని లాస్ ఏంజెల్స్ కౌంటీ సుపీరియర్ కోర్టును ఆశ్రయించారు. ఏప్రిల్‌లో ఈ పిటిషన్ దాఖలు చేయగా.. తాజాగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది.
కెనడా నటి జస్టిన్ విల్సన్‌ను 2000 సంవత్సరంలో మస్క్ వివాహం చేసుకున్నాడు. ఎనిమిదేళ్ల తర్వాత ఆమెకు మస్క్ విడాకులు ఇచ్చాడు. అయితే వీరిద్దరికీ ఆరుగురు సంతానం. ఐవీఎఫ్ ద్వారా జస్టిన్ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. విడాకుల అనంతరం తల్లిదండ్రులిద్దరూ వారి పిల్లల సంరక్షణను చూసుకుంటున్నారు. కవలల్లో ఒకరైన అలెగ్జాండర్ మస్క్ ప్రస్తుతం పేరు మార్పునకు దరఖాస్తు చేసుకున్నారు. అమ్మాయిగా మారిన అలెగ్జాండర్.. తల్లి పేరును చేర్చుకుని తన పేరును వివియన్ జెన్నా విల్సన్‌గా పేర్కొన్నాడు.
ఎలోన్ మస్క్ లింగమార్పిడి సమస్యలపై ఎప్పుడూ బాహాటంగా మాట్లాడుతుంటాడు. అందుకే ఆయన్ను జనాలు యాంటీ గే అని కూడా అంటారు. అమెరికా ప్రభుత్వం ట్రాన్స్జెండర్ల హక్కులపై విధించిన పరిమితులకు ఎలాన్ మస్క్ మద్దతు తెలిపాడు. దీంతో వారిద్దరి మధ్య గొడవ జరగడంతోనే జెన్నా తన తండ్రి(బయోలాజికల్) ఎలాన్ మస్క్‌తో ఏ రూపంలోనూ బంధాన్ని కోరుకోవడంలేదని తెలుస్తోంది.