దేశ ప్రధాని తన చరిష్మాతో భారత కీర్తిని ప్రపంచ దేశాల స్థాయికి నిలబెట్టారు. ఎప్పటికప్పుడు ఆయన తనదైన శైలీతో పలు దేశాలలో పర్యటిస్తూ.. నాయకులతో మాట్లాడుతూ.. స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే మోదీ పలు దేశాలలో జరిగిన అనేక సమావేశాలలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే జర్మనీలో రెండు రోజుల పాటు జరిగిన జీ7 సమావేశాలకు హజరయ్యేందుకు వెళ్లారు.
భారత ప్రధాన నరేంద్రమోదీ జర్మనీలో జరుగుతున్న జీ7 వార్షిక సమావేశంలో పాల్గొనడానికి వెళ్లారు. ఈ సమావేశంలో జీ7 సభ్య దేశాలైన.. అమెరికా, బ్రిటన్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీలతో అధినేతలు హజరయ్యారు. ఈ క్రమంలో మోదీ.. పలు దేశాల నాయకులతో కరచాలనం చేస్తున్నారు. అప్పుడు ఒక ఆసక్తర ఘటన జరిగింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అక్కడికి చేరుకున్నారు.
ప్రోటోకాల్ పక్కన పెట్టి మోదీని.. పిలిచి మరీ కరచాలనం చేశారు. మోదీ కూడా తిరిగి అంతే ఆప్యాయంగా అమెరికా అధ్యక్షుడి తో మాట్లాడారు. పలు దేశాల నాయకాలు మోదీని పలకరించడానికి ఆసక్తి చూపించారు. ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన దేశం, పెద్దన్న పాత్ర పోషించే దేశాధ్యక్షుడు మోదీని స్వయంగా వచ్చి పలకరించడం ఇప్పుడు ప్రపంచం దృష్టిని ఆకర్శించింది. ప్రస్తుంతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
భారత్ లాంటి శక్తి వంతమైన దేశం నాటి కాంగ్రెస్ నాయకుల చర్యల వలన ఇప్పటికి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుందని మోదీ అన్నారు. ఇది దేశానికి గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జూన్ 25, 1975న దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆ తర్వాత... మార్చి 21, 1977న ఎత్తివేయబడింది. ఈ మధ్య కాలంలో అనేక అణచివేత కార్యక్రమాలు జరిగాయి.