వరుస సెలవుల సంగతి ఎలా ఉన్నా, కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు 50 శాతం ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలనే నిబంధన అమలవుతున్నది. బ్యాంకుల సెలవులు, ఫిజికల్ సర్వీసుల్లో ఇబ్బందుల దృష్ట్యా ఖాతాదారులు ఆన్ లైన్, డిజిటల్ మార్గాలను వాడుకోవాలని బ్యాంకులు సూచిస్తున్నాయి.