BANGALORE UNIVERSITY GAVE 73 MARKS OUT OF 70 MARK TO STUDENTS NS
Bangalore University: కరోనా సిత్రాలు.. 70కి 73 మార్కులు వేసిన యూనివర్సిటీ.. అంతా షాక్.. అసలేమైందంటే?
Bangalore University: బెంగళూరు యూనివర్సిటీ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. మాగ్జిమమ్ మార్క్స్ కంటే కూడా మరో మూడు మార్కులు ఎక్కువ వేసి విద్యార్థులు షాక్ ఇచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా ప్రారంభమైనప్పటి నుంచి విద్యారంగంలో విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అంతా పాస్ అని ప్రభుత్వాలు ప్రకటిస్తుండడంతో ఏళ్లుగా పరీక్షలతో కుస్తీలు పడుతున్న వారు కూడా పాసై పోతున్నారు.
2/ 5
ఈ నేపథ్యంలో ఓపెన్ విధానంలో ఎగ్జామ్స్ కు అప్లై చేసుకునే వారి సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. పరీక్షలు ఎలాగు రద్దు అవుతాయి.. దీంతో ఎలాగైనా పాసైపోతామన్న ధీమానే ఇందుకు కారణం.
3/ 5
తాజాగా బెంగళూరు యూనివర్సిటీలో ఇలాంటి విచిత్రం మరొకటి చోటు చేసుకుంది. విద్యార్థులకు 70 మార్కులకు గాను అధికారులు ఏకంగా 73 మార్కులు కేటాయించడంతో వారంతా అవక్కయ్యారు.
4/ 5
వాస్తవానికి ఈ ఎగ్జామ్ 100 మార్కులకు నిర్వహించారు. అయితే 70 మార్కులు ఎగ్జామ్ కు, మరో 30 మార్కులు ఇంటర్నల్స్ కు కేటాయించారు. అయితే ఎగ్జామ్ కు హాజరైన విద్యార్థులకు 70కి బదులుగా 73 రావడంతో వారంతా రిజల్ట్ చూసుకుని షాక్ అయ్యారు.
5/ 5
కేవలం యూనివర్సిటీలో మాత్రమే కాకుండా.. యూనివర్సిటీ అనుబంధ కాలేజిలకు చెందిన విద్యార్థులకు కూడా ఇలాంటి ఫలితాలే నమోదయ్యాయి. దీంతో విద్యార్థులు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకుపోయారు. అయితే యూనివర్సిటీ అధికారులు ఈ అంశంపై ఎలా స్పందిస్తారు? సమస్యను ఎలా పరిష్కరిస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.