Baba Vanga : భవిష్యత్తును చాలా వరకూ పర్ఫెక్టుగా ఊహించిన వారిలో వంగ బాబా ఒకరు. చూపు లేని ఆమె.. కళ్లు మూసుకొని ఆకాశం వైపు చూస్తూ.. భవిష్యత్తును అంచనా వేశారు. వీరబ్రహ్మేంద్రస్వామి, నోస్ట్రడామస్ లాగానే ఆమె కూడా చాలా వరకూ జరగబోయే అంశాలను ముందే చెప్పారు. 2022కి సంబంధించి ఆమె చెప్పిన 6 అంశాల్లో 2 నిజంగానే జరిగాయి. అందువల్ల 2023కి సంబంధించి ఏం చెప్పారన్నది ఆసక్తిగా మారింది. చెప్పాలంటే.. ఆమె చెప్పినవాటిలో 5 నిజంగానే జరిగితే.. 2023 సంవత్సరం.. చరిత్రలో విచిత్రమైన సంవత్సరంగా మిగిలిపోతుంది. (image credit - twitter - JosephsQuartzy)
2023కి బాగా వంగ అంచనాలు: ఒక పెద్ద దేశం జీవ రసాయన ఆయుధాల (biological weapons)తో ప్రజలపై దాడి చేస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ కోణంలో చూస్తే.. ఆ పెద్ద దేశం అనుకోవచ్చు. ఆల్రెడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. మాటిమాటికీ అణ్వాయుధాల ప్రస్థావన తెస్తున్నారు. అందువల్ల ఇది జరిగినా ఆశ్చర్యం అక్కర్లేదంటున్నారు.