లండన్‌ రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో సందడి చేసిన బాహుబలి టీం..

లండన్‌లో బాహుబలి బృందం సందడి చేస్తోంది. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన భారీ చిత్రం బాహుబలి. లండన్‌లో ప్రఖ్యాత రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్‌లో 19వ తేదీన సాయంత్రం 7 గంటలకు ‘బాహుబలి: ది బిగినింగ్‌’ సినిమాని స్క్రీనింగ్ చేశారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి,నిర్మాత శోభు యార్లగడ్డ, ప్రభాస్‌, అనుష్క, మరియు రానా హాజరయ్యారు