AUTOMOBILE INDUSTRY FACES SLOWDOWN IN 2019 KNOW IMPORTANT FACTORS
గడ్డుకాలంలో ఆటోమొబైల్ రంగం...10 లక్షల ఉద్యోగాలపై వేలాడుతున్న కత్తి
దేశీయంగా వాహన తయారీ సంస్థలు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. అమ్మకాలు 19 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే వాహన తయారీ సంస్థలో పనిచేస్తున్న దాదాపు 10 లక్షల మంది తమ ఉద్యోగాలు కోల్పోయే అవకాశముంది.
దేశీయంగా ఆటోమొబైల్ రంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వాహన విక్రయాలపరంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద మార్కెట్ అయిన భారత్లో...ఇటీవల కాలంగా వాహనాల అమ్మకాలు గణనీయంగా తగ్గడంతో నిల్వలు పేరుకుపోతున్నాయి.
2/ 8
సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫేక్చరర్స్(సియామ్) గణాంకాల మేరకు జులై మాసంలో వాహన విక్రయాలు 31 శాతం క్షీణించి 19 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. డిసెంబరు 2000లో వాహన విక్రయాలు 35 శాతం తగ్గుముఖంపట్టగా...ఆ తర్వాత ఈ స్థాయికి తగ్గుముఖంపట్టడం ఇదే తొలిసారి.
3/ 8
గత ఏడాది జులై మాసంలో 2,90,931 ప్రయాణీకుల వాహనాలు విక్రయంకాగా...ఈ ఏడాది జులై మాసంలో 2,00,790 వాహనాలు మాత్రమే అమ్ముడుపోయాయి.
4/ 8
ప్రయాణీకుల వాహనాల విక్రయాలు వరుసగా తొమ్మిదో నెల తగ్గుముఖం పట్టాయి. ప్రయాణీకుల వాహన ఉత్పత్తి 13 శాతం క్షీణించింది. 2018 జులై మాసం మొదలు గత 13 మాసాల్లో ఒక్క మాసం మినహా మిగిలిన అన్ని మాసాల్లో వాహనాల విక్రయాలు తగ్గుముఖం పడుతున్నాయి.
5/ 8
అగ్ర తయారీ సంస్థలైన మారుతి సుజుకీ, మహీంద్ర అండ్ మహీంద్రా, టాటా మోటార్స్, ఫోర్డ్, టయోటా, హోండా వాహనాలకు మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో ఆ మేరకు ఉత్పత్తిని తగ్గించాయి.
6/ 8
అటు ద్విచక్ర వాహన విభాగంలోనూ డిమాండ్ తగ్గడంతో ఉత్పత్తిని ఆయా సంస్థలు తగ్గించాయి. దీంతో మోటార్ బైకులు, స్కూటీల నిల్వలు పేరుకుపోతున్నాయి.
7/ 8
మాంధ్యం భయాలు, ద్రవ్య లభ్యత వాహనాల అమ్మకాలపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇటీవల మహారాష్ట్ర, కర్ణాటక, కేరళతో పాటు మరికొన్ని రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. ఇది వాహనాల విక్రయాలపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని ప్రముఖ వాహన తయారీ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.
8/ 8
ఆటోమొబైల్ రంగంలో నెలకొంటున్న పరిస్థితుల కారణంగా గత మూడు మాసాల్లో దాదాపు 15 వేల మంది సాధారణ, తాత్కాలిక కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించారు. అలాగే దాదాపు 2 లక్షల మంది డీలర్లను తొలగించారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ రంగంలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగం కోల్పోయే ప్రమాదముందని అంచనావేస్తున్నారు.