Asteroid: అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ - నాసా ఓ షాకింగ్ విషయం చెప్పింది. ఈజిఫ్టులోని పిరమిడ్లలో పెద్దదైన గిజా పిరమిడ్ కంటే రెండు రెట్లు పెద్దగా ఉన్న గ్రహశకలం 465824 (2010 FR)... ఆదివారం భూమివైపు వచ్చి వెళ్లినట్లు తెలిపింది. ఈ గ్రహశకలం సైజు 393 అడుగుల నుంచి 885 అడుగుల దాకా ఉండొచ్చని నాసా అంచనా వేసింది.
అంత దూరం నుంచి వెళ్లిన గ్రహశకలం గురించి నాసా ఎందుకు అప్రమత్తమైంది? అన్న డౌట్ మనకు రావచ్చు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఈ గ్రహశకలం భూకక్ష్య లోంచీ వెళ్లింది. అదీ కాక ఇది... సెకండ్‌కి 14 కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది. ఇంత వేగంతో వెళ్లే, ఇంత పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొంటే... భూమి ముక్కలవ్వడం ఖాయం. అందుకే... అది దూరంగా వెళ్తున్నా... నాసా దాన్ని ఓ కంట కనిపెట్టింది. ఈ గ్రహశకలాన్ని నాసా... 2010 మార్చి 18న చూసింది. అప్పటి నుంచి దాని కదలికలను గమనిస్తూనే ఉంది. (credit - NASA)