AI Photos : మనం చెయ్యడానికి ఎక్కువ టైమ్ పట్టే చాలా లెక్కలను కంప్యూటర్ ద్వారా చేస్తాం. అలాగే.. ఫలానా అడవికి సంబంధించి... గత 1000 ఏళ్లలో ఎలా ఉందో లెక్కలోకి తీసుకొని.. వచ్చే 100 ఏళ్ల తర్వాత అది ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ ఇప్పుడు ఉపయోగపడుతోంది. ఈ ప్రశ్నను మనం కృత్రిమ మేథస్సు కలిగిన సాఫ్ట్వేర్ని అడిగినప్పుడు... అది గత 1000 ఏళ్లలో ఆ అడవికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని గ్రహించి.. కొన్ని అంచనాలు వేసి... సమాధానం ఇస్తుంది. ఇదే విధంగా ఎన్నో ప్రశ్నలను సంధిస్తున్నారు. వాటికి AI ఇచ్చే ఆన్సర్లు ఆసక్తిగా ఉంటున్నాయి. (image credit - instagram - sahixd)