ఎవరికైనా డ్రెస్‌లు వేసుకోవడం అనేది వాళ్లకు నచ్చినట్లుగా అంశం. స్టైల్‌గా ఉండేందుకు నచ్చిన డ్రెస్‌లు వేసుకుంటారు. ఇంకా మహిళలు వేసుకునే దుస్తుల విషయంలో కూడా ఎలాంటివి అయితే వాళ్లకు బాగుంటాయో సలహా ఇస్తూ ఉంటారు. కాని అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం డ్రెస్ సెలక్షన్లో డిఫరెంట్ టేస్ట్ అని చెప్పాలి.ఎందుకంటే అతనికి మగవాళ్ల డ్రెస్సుల కంటే ఆడవాళ్ల డ్రెస్లంటేనే ఎక్కువ ఇష్టం.
అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన మార్క్ జర్మనీలో నివసిస్తున్నారు. రోబోటిక్స్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సందర్భం ఎందుకొచ్చిందంటే మార్క్ ఎక్కువగా లేడిస్ డ్రెస్‌లు వేసుకుంటాడు. ఆఫీసుకైనా, ఇంట్లో ఉన్నా ఫ్రెండ్స్‌తో పార్టీలకు వెళ్లినా ఆడవాళ్ల డ్రెస్‌లు వేసుకొని వెళ్తుంటాడు. ఇదేంటని అడిగితే ఏమంటాడో తెలుసా..తనకు వేసుకునే బట్టల్లో ఆడ, మగ తేడా కనిపించదని ...రెగ్యులర్‌గా వేసుకునే డ్రెస్‌లతో బోర్ కొట్టడం వల్లే ఇలాంటి ప్రయోగం చేశానంటున్నాడు.
ఒక్క మాటలో చెప్పాలంటే మార్క్ సింగిల్‌గానే కాదు తన భార్యతో కలిసి షాపింగ్ చేస్తున్నప్పుడు కూడా అతను ఆడవాళ్ల డ్రెస్‌లు వేసుకోవడం మొదలుపెట్టాడు. 20 ఏళ్లుగా మగవాళ్లు వేసుకునే డ్రెస్‌లతో బోర్ కొట్టడంతో తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకున్నాడు. 2015 సంవత్సరం నుంచి కాళ్లకు హైహీల్స్ ధరించడం మొదలుపెట్టాడు. ఆఫీసులో కూడా ప్రజలు అతనిని ఎగతాళి చేసినప్పటికీ పట్టించుకోలేదు. మరికొంత మంది అతన్ని స్వలింగ సంపర్కుడిగా కూడా భావించినప్పటికి తన అభిరుచి మార్చుకోలేదు.
భార్య, ముగ్గురు పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్న మార్క్ డ్రెస్సింగ్ స్టైల్లో మాత్రం లింగబేధం లేదని గట్టిగా బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. డ్రెస్‌ల విషయంలో ఎవరికి నచ్చితే అది వేసుకోవచ్చు. అందులో ఆడ, మగా తేడా ఏంటని అంటాడు. ఈవిషయంలో తన అభిరుచి పట్ల అతని భార్యకు మాత్రం ఎటువంటి అభ్యంతరం లేదంటున్నాడు.
గత 5 సంవత్సరాలుగా అతను ఆఫీసుకు వెళ్లేటప్పుడు కూడా స్కర్టులు, హీల్స్ వేసుకొని వెళ్తున్నాడు. కాలేజీలో చేరినప్పటి నుంచి తన స్టైల్లో మార్పు నచ్చిందని మార్క్ చెప్పాడు. అంతకుముందు మాములుగా బహిరంగ ప్రదేశాల్లో హైహీల్స్ ధరించలేదట. కానీ తన బెడ్రూంలో మాత్రం వాటిని వేసుకునేవాడు. హై హీల్స్ వేసుకోవడం వల్ల తనలో విశ్వాసం మరింత వస్తుందన్నాడు. పురుషుల స్టైల్ టాప్స్‌తో ఆడవాళ్ల స్కర్ట్‌లను తీసుకువెళతారు.
6 అడుగుల ఎత్తు ఉన్న ఈ జంటిల్మెన్ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం ఇప్పుడు అందర్ని ఆకట్టుకుంటోంది. మార్క్ ఫుట్‌బాల్ పిచ్‌లో సాధారణ బూట్లు వేసుకొని దుస్తులలో కనిపిస్తాడు. ఎందుకంటే లేడిస్ తరహా డ్రెస్‌లు వేసుకోవడం అక్కడ అవసరం లేదంటాడు.ఒక్కోసారి తనని వింత కళ్లతో చూసేవాళ్లే కానీ..ఎవరు ఏం మాట్లాడినా పర్వాలేదనిపించే వయసులో తాను ఉన్నానన్నాడు మార్క్.(Photo Credit- Instagram/markbryan911)