ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి మీద కల్గుతుందో ఎవరు చెప్పలేదు. కొంత మంది అన్నిరకాలుగా సెటిల్ అయిన వారిని చూసి లవ్ చేస్తుంటారు. మరికొందరు మాత్రం క్యాష్ ఫీలింగ్, కాస్ట్ ఫీలింగ్ లను అసలు చూపించరు. తమ మనసుకు నచ్చితే చాలనుకుంటారు. పెద్దలను ఎదిరించైన సరే పెళ్లి చేసుకుంటారు. ఇప్పటికే లేటు వయసులలో కూడా అనేక పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఈ కోవకు చెందిన మరో ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అయితే, ఇప్పుడు పిల్లలను కనాలని అనుకున్నారు. అనేక ఆస్పత్రులకు తిరిగారు. అయితే, వయసులో వీరి మధ్య 37 ఏళ్ల గ్యాప్ ఉంది. దీంతో పిల్లలను కనడానికి చెరిల్ కు శరీరం సహకరించలేదు. అంతేకాకుండా.. ఖురాన్ మెక్ కాయిన్ కు ఇది తొలిసంతానం. ఇక.. మెక్ గ్రెగర్ కు ఇప్పటికే.. ఏడుగురు పిల్లలు ఉన్నారు. అయితే, దీనికోసం సరోగసి ని ప్లాన్ చేయాలని అనుకున్నారు. దీని కోసం.. దాదాపు.. 1. 14 కోట్లను ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
మొదట్లో వీరి పెళ్లిని సమాజం వింతగా చూశారు. కానీ ఈ జంట దాన్ని అసలు పట్టించుకొలేదు. అందరి ముందే చట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. చుట్టుపక్కల వారు ఎమనుకున్న డోంట్ కేర్ అన్నట్లు ప్రవర్తించారు. తమ మనసుకు నచ్చిందే చేస్తామని ఫిక్స్ అయ్యారు. దీంతో ఇంట్లో వారు, స్నేహితులు, బంధువులు వద్దన్న కూడా పెళ్లిచేసుకున్నారు.
తమ ప్రేమకు గుర్తుగా రాబోయే బిడ్డకోసం ఎంతైన ఖర్చు చేస్తామని వీరు అంటున్నారు. ప్రస్తుతం తమ బిడ్డ కోసం ఎంతో ఎక్సైట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నామని అన్నారు. తనకు పుట్టబోయే బిడ్డ కోసం, చెరిల్ మెక్ గ్రెగర్ ఇప్పటికే షాపింగ్ కూడా ప్రారంభించారు. కాగా, వీరు సరోగసిని ప్రాసెస్ ను స్టార్ట్ చేసేశారు. 2023లో సరోగసి ద్వారా వీరికి బిడ్డ పుట్టబోతున్నట్లు సమాచారం. అయితే, ఖురాన్ కు 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు.. చెరిల్ కొడుకు నిర్వహిస్తున్న ఫాస్ ఫుడ్ లో పనిచేసేవాడు.
అప్పటి నుంచి వీరి మధ్య పరిచయం ఏర్పడింది. దీంతో ఆతర్వాత.. ఇది ప్రేమగామారి పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు.. పెళ్లిచేసుకుని, బిడ్డకు జన్మనివ్వడానికి ప్లాన్ వేస్తున్నారు. అయితే, దీనికోసం ఈ దంపతులు ఖర్చు 1.14 కోట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట వైరల్ మారింది. దీన్ని చూసి నెటిజన్లు షాకింగ్ తో నోరెళ్ల బెడుతున్నారు.