నిజామాబాద్ జిల్లా... నిజామాబాద్ మండలం, మల్కాపూర్ గ్రామంలో దశాబ్దాల కిందట వెలిసింది గుండురాయి. సుమారు పది అడుగుల ఎత్తు ఉంటుంది.
2/ 12
నడుము నొప్పి, కడుపు నొప్పి, వెన్నునొప్పి ఉన్నవారు ఈ బండరాయి కింద నుంచి వెళితే నొప్పులు తగ్గిపోతాయని గ్రామస్తుల నమ్మకం.
3/ 12
నమ్మకమే కాదు ఇలా వెళ్లిన వారికి క్షణాల్లో నొప్పులు మాయమయ్యాయని చెబుతారు గ్రామస్థులు.
4/ 12
ఈ గుండురాయి వైద్యం మకీల్ నొప్పికి ప్రసిద్ధి. తరాలు మారినా పూర్వ ఆచారాలు మారడం లేదు. పూర్వం ప్రజలు నడుంనొప్పి వంటి సమస్యలు వచ్చినప్పుడు మకీల్ గుండు దగ్గరకు వచ్చేవారు. రాయి కింద నుంచి దూరేవారు.
5/ 12
అలా దూరినప్పుడు కింద ఉన్న రాయి పొట్టపై ఒత్తిడి కలిగిస్తుంది. తద్వారా పొట్టలో సమస్యలు నయమవుతాయనీ.... పైన ఉన్న రాయి నడుం నొప్పిని తగ్గిస్తుందని ప్రజల నమ్మకం.
6/ 12
ఈ బండరాయి దశాబ్దాలుగా ఎన్నో ప్రకృతి విపత్తులను తట్టుకుని ఎలాంటి ఆధారం లేకుండా... అటూ ఇటూ పడకుండా నిలబడింది.
7/ 12
ఈ బండరాయే ఇప్పుడు గ్రామస్తులకు ఓ వైద్యశాలలా మారింది. బండ కింద మనిషి పట్టేంత స్థలం లేకపోయినా అలాగే దూరి ఈజీగానే బయటకు వస్తున్నారు.
8/ 12
బండ రాయి కిందకు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు.... రెండు సార్లు వెళ్తే చాలట ఎలాంటి నొప్పులైనా తగ్గిపోతాయి అంటున్నారు.
9/ 12
ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు బండరాయి వైద్యం ఫలించదని తెలిపారు. ఉదయం ఖాళీ కాడుపుతో వస్తేనే కడుపు నొప్పి మాయమవుతుందని గ్రామస్తులు చెబుతున్నారు.
10/ 12
మల్కాపూర్‌లోని గుండు రాయికి మకీల్ రాయి అని పేరు రావడంతో మకీల్ సమస్యలున్న వారు ఇక్కడి వస్తున్నారు.
11/ 12
హైదరాబాద్, మహారాష్ట్ర, బాసర తదితర జిల్లాల నుంచి కూడా వస్తుంటారని... స్థానికులు చెబుతున్నారు.
12/ 12
ఇలాంటివి ఈ రోజుల్లో కూడా నమ్ముతున్నారా అని హేతువాదులు అంటుంటే... తమ నమ్మకం తమది అని స్థానికులు గొప్పగా చెబుతున్నారు. ఈ రాయివల్లే తాము డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిన పనిలేకుండా పోతోందని అంటున్నారు.