Kerala Plane Crash : కోజికోడ్ ఎయిర్‌పోర్టులో జరిగిన విమాన ప్రమాదం... జరగకుండా ఉండి ఉండాల్సింది అని అంతా అనుకుంటున్నారు. ఏ సాంకేతికలోపంతోనో ప్రమాదం జరిగివుంటే... సరే అనుకోవచ్చు. కానీ... ల్యాండింగ్ సమయంలో ప్రమాదం జరగడమనేది అందర్నీ కలచివేస్తోంది. శుక్రవారం రాత్రి 7:40 గంటలకు 191 మందితో... ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం... కోజికోడ్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ల్యాండ్ అవుతూ... పక్కకు జారిపోయింది. ఇందుకు కారణం... కేరళలో జోరు వర్షాలు పడుతుంటే... రన్‌వే తడిగా ఉంది. అందువల్లే టైర్లు జారి... విమానం పక్కకు వెళ్లి... కుదుపులకు లోనై... 50 అడుగుల లోయలోకి జారి... రెండు ముక్కలైంది. ఈ ప్రమాదంలో పైలట్, కోపైలట్ సహా... 20 మంది ప్రాణాలు కోల్పోయారు. (credit - twitter - ANI)
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 737 ఐఎక్స్ 1344, ఎక్స్‌ప్రెస్ విమానం... ‘వందే భారత్’లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. దుబాయ్ నుంచి పది మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, ఏడుగురు సిబ్బందితో కొజికోడ్ బయలుదేరింది. ప్రమాదానికి ముందు... రెండుసార్లు ల్యాండింగ్ కోసం ప్రయత్నించి... ఆకాశంలోనే రౌండ్లు వేసింది. మూడోసారి ల్యాండ్ అవుతూ... ప్రమాదంలో చిక్కుకుంది. (credit - twitter - ANI)
కూలిన విమానాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. పైకి ఎంతో అందంగా కనిపించే విమానాలు... ప్రమాదం తర్వాత ఇంత దారుణంగా ఉంటాయా? అని తుక్కుతుక్కుగా మారిన విమానాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. 30 అడుగుల ఎత్తున ఉన్న రన్‌వే నుంచి లోయలోకి విమానం ఎలా జారిపోయి ఉంటుందో తలచుకొని వామ్మో అనుకుంటున్నారు. ఈ విమాన ప్రమాదం ఎలా జరిగిందో DGCA దర్యాప్తునకు ఆదేశించింది. (credit - twitter - ANI)