బాలీవుడ్ సీనియర్ నటి నసీఫా అలీ తనకు క్యాన్సర్ సోకిన విషయాన్ని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా తెలియచేసింది. తన స్నేహితురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సోనియాగాంధీతో కలిసి ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన నసీఫా అలీ... ‘నాకు క్యాన్సర్ సోకిన విషయం తెలియగానే నా స్నేహితురాలు సోనియాగాంధీ, నన్ను పరామర్శించడానికి వచ్చింది...’ అంటూ కామెంట్ చేసింది. (Photo: Instagram)
1972-74ల మధ్య జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్‌గా ఉన్న నసీఫా అలీ... విభిన్న రంగాల్లో రాణించి మల్టీటాలెంటెండ్ పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. 1976లో మిస్ ఇండియా టైటిల్ గెలిచిన నసీఫా.... మిస్ ఇంటర్నేషనల్ పోటీల్లోనూ సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. అంతేకాదు కోల్కత్తా జింఖానా 1979 సమయంలో హార్స్ జాకీగానూ ఉంది. (photo: Instagram)