ఇక ఇలాంటి నగల తయారీకి సంబంధించి జాక్వికి రోజూ ఎన్నో రిక్వెస్టులు వస్తుంటాయి. వీటిల్లో కొన్నింటిని ఆమె తిరస్కరిస్తుంది కూడా. ఎందుకంటే ఒకరు ఏకంగా గర్భనిరోధక సాధనమైన ఐయూడీని ఉపయోగించి నగలు తయారుచేయాలని కోరారు. అయితే అది ప్లాస్టిక్ కావడం వలన ఆమె ఆ రిక్వెస్ట్‌ను తిరస్కరించింది. (image credit - instagram - grave_metallum)
మరొకరైతే ఓ బుల్లెట్ తీసుకువచ్చి నగ తయారుచేయమని కోరారు. అయితే తాను కేవలం మానవ అవశేషాలతో మాత్రమే నగలు చేస్తానని జాక్వి చెప్పగా ఆ బుల్లెట్ తీసుకువచ్చిన వ్యక్తి తన తాతగారు గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని, ఆ బుల్లెట్ ఆయన్ని చంపిందని తెలిపాడు. అయితే దంతాలు, వెంట్రుకలు, చితాభస్మంతో మాత్రమే తాను నగలు చేయగలనని, మనిషిని చంపినవాటితో చేయలేనని జాక్వి ఆ క్లయింట్‌కు చెప్పి పంపింది. (image credit - instagram - grave_metallum)