కొన్ని స్టోరీలు ఇన్స్పైర్ కలిగిస్తాయి. ఇది అలాంటిదే. కాళ్లు లేని ఈ తాబేలు పేరు పెడ్రో. అమెరికా... లూసియానా స్టేట్ యూనివర్శిటీలోని వెటెరినరీ టీచింగ్ హాస్పిటల్లో ఇది ఓ పేషెంట్. (Image : LSU School of Veterinary Medicine)
2/ 8
మొదటిసారి దీన్ని ఓ కుటుంబం దత్తత తీసుకున్నప్పుడు దీనికి ఒక కాలు లేదు. కొన్ని నెలలు ఎటో వెళ్లిపోయిన ఈ తాబేలు... రెండో కాలు కూడా పోగొట్టుకుంది. (Image : LSU School of Veterinary Medicine)
3/ 8
పెడ్రో పడుతున్న బాధను చూడలేకపోయిన ఆ కుటుంబం, దాన్ని లూసియానా స్టేట్ యూనివర్శిటీ వెటెరినరీ టీచింగ్ హాస్పిటల్కి తీసుకొచ్చింది. (Image : LSU School of Veterinary Medicine)
4/ 8
ఈ తాబేలును గమనించిన డాక్టర్లకు మొదట ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఇదివరకు కుక్కలకు ఇలాగే కాళ్లు లేకపోతే, చక్రాలు అమర్చేవాళ్లు. ఇది చిన్న తాబేలు. దీనికి ఏం చెయ్యాలా అని ఆలోచించారు. (Image : LSU School of Veterinary Medicine)
5/ 8
డాక్టర్ల ప్రశ్నకు సమాధానం... అక్కడికి దగ్గర్లోని టాయ్ స్టోర్ (బొమ్మల షాపు)లో దొరికింది. (Image : LSU School of Veterinary Medicine)
6/ 8
లెగో కార్ కిట్ కొన్ని డాక్టర్లు... వాటి ద్వారా... తాబేలు వెనక భాగంలో... రెండు చక్రాలు ఉండేలా అమర్చారు. (Image : LSU School of Veterinary Medicine)
7/ 8
ఈ వీల్ చైర్ వల్ల... పెడ్రో వెనక భాగం... భూమికి తగులుకోకుండా కాపాడినట్లైంది. చక్రాల వల్ల ఈజీగా తాబేలు నడవగలుగుతోంది. (Image : LSU School of Veterinary Medicine)
8/ 8
మామూలుగా ఈ సైజులో ఉన్న తాబేళ్ల కంటే వేగంగా పెడ్రో వేగంగా నడుస్తోంది. ఆ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషపడుతున్నారు. (Image : LSU School of Veterinary Medicine)