A PERSON NOT CONTRACTED CORONAVIRUS YET IS COVIRGIN A NEW WORD ADDED TO ONLINE ENGLISH HINDI VOCABULARY MKS
covirgin : ఇప్పటిదాకా కరోనా సోకలేదా? అయితే మీరు కొవర్జిన్ -డిక్షనరీలో కొత్త పదం రచ్చ
గడిచిన రెండేళ్లలో లక్షల కుటుంబాలు తమవారిని కోల్పోగా, కోట్ల మంది వైరస్ బారినపడ్డారు. అయితే, ఇప్పటిదాకా కొవిడ్ ముఖం ఎరుగనివాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అదిగో, అలాంటివారి కోసమే డిక్షనరీలో కొత్త పదం పుట్టుకొచ్చింది. వివరాలివి..
వర్షాకాలంలో వెళ్లినట్లే వెళ్లి చలికాలానికి మళ్లీ తిరగబెట్టింది కరోనా మహమ్మారి. కొత్త వేరియంట్ తోపాటు పాత వేరియంట్లూ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాల్లో మళ్లీ కేసులు, మరణాలు పెరిగాయి. మన దేశంలో నిన్న ఒక్కరోజే కొవిడ్ కాటుకు 327 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 1.6లక్షల కేసులు నమోదయ్యాయి.
2/ 9
ఆదివారం నాటికి గ్లోబల్ గా కొవిడ్ కేసుల సంఖ్య 30కోట్ల మార్కును చేరగా, మరణాల సంఖ్య 55 లక్షలు దాటేసింది. కొవిడ్ బాధిత దేశాల్లో అమెరికా తర్వాతి స్థానంలో ఉన్న భారత్ లో ఇప్పటి దాకా 4.83లక్షల మది ప్రాణాలు కోల్పోగా, కేసుల సంఖ్య 3.5కోట్లకుపైగా ఉంది.
3/ 9
గడిచిన రెండేళ్లలో లక్షల కుటుంబాలు తమవారిని కోల్పోగా, కోట్ల మంది వైరస్ బారినపడ్డారు. అయితే, ఇప్పటిదాకా కొవిడ్ ముఖం ఎరుగనివాళ్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అదిగో, అలాంటివారి కోసమే డిక్షనరీలో కొత్త పదం పుట్టుకొచ్చింది..
4/ 9
వయసును బట్టి లైంగిక ఉద్దీపన కలిగిన తర్వాత కూడా సెక్స్ లో పాల్గొనని వాళ్లను వర్జిన్ (virgin) అంటారని తెలిసిందే. మన హిందీ, తెలుగులోనైతే వర్జిన్ పురుషుణ్ని బ్రహ్మచారి అని, స్త్రీని కన్య అని వ్యవహరించడం వింటుంటాం.
5/ 9
అదే తీరులో, ప్రపంచమంతా కరోనా కల్లోలం కొనసాగుతున్నా ఇప్పటిదాకా వైరస్ కాటుకు గురికాని వ్యక్తుల్ని ‘కొవర్జిన్ (covirgin)’అని భావించాలట.
6/ 9
ఆన్ లైన్ హిందీ, ఇంగ్లీష్ డిక్షనరీల్లో ఇప్పటికే ఈ పదం బహుగా వ్యాప్తిలోకి వచ్చింది. ఇంగ్లీష్, హిందీ వొకాబులరీకి కొత్త పదం జోడైందంటూ కొవర్జిన్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
7/ 9
#covirgin ట్యాగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లోనూ నిలిచింది. నిజానికి కొవిడ్ సోకని వ్యక్తుల్ని కొవర్జిన్ గా అభివర్ణించడం గతేడాది నుంచే మొదలైంది. కొన్నాళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడీ పదం మరోసారి వైరలవుతోంది. వాస్తవంగా..
8/ 9
ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా పలు ప్రఖ్యాత సంస్థల నిపుణుల అంచనాల ప్రకారం పెద్ద సంఖ్యలో పుట్టుకొచ్చిన కొవిడ్ వేరియంట్లలో కొన్ని మనుషులకు సోకినా బహుశా ఆ విషయం తెలియకుండా, పెద్ద ప్రభావమేమీ లేకుండా ఉంటాయి.
9/ 9
మన దేశంలో కొవిడ్ పై జరిపిన పలు సర్వేల్లోనూ జనాభాలో 60 నుంచి 70 శాతం మందికి కొవిడ్ వచ్చి పోయిందని, ప్రమాదకర వేరియంట్ల విషయంలోనే జాగ్రత్తలు అవసరమని రిపోర్టులున్నాయి. ప్రస్తుతం జడలు విప్పుతోన్న ఒమిక్రాన్ ను ప్రమాదకర వేరియంట్ గా డబ్ల్యూహెచ్ఓ ఇటీవలే ప్రకటించింది.