Delhi Tunnel: ఆశ్చర్యం.. ఢిల్లీ అసెంబ్లీలో బయటపడిన భారీ సొరంగం.. ఆ మిస్టరీ టన్నెల్ గురించిన విశేషాలివే..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఓ అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఢిల్లీ అసెంబ్లీలో ఓ భారీ సొరంగం బయటపడింది. అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు ఆ సొరంగం నుంచి దారి ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. బ్రిటీషర్లపై పోరాడిన సందర్భంలో స్వాతంత్ర్య సమరయోధులను బ్రిటీషర్లు ఆ సొరంగ మార్గం ద్వారా తరలించి ఉండొచ్చని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ తెలిపారు. శుక్రవారం ఈ టన్నెల్ గుట్టు తెలిసింది.