స్కూ ల్ ఆఫ్ డిజైనింగ్‌లో ప్రొడక్ట్ డిజైనింగ్ కోర్సు చదివింది జమీల్యా. ఢిల్లీలోని టాటా లైఫ్ సైన్సెస్‌లో పని చేసింది. ఆ అనుభవం ఆ అమ్మాయికి విదేశాల్లో లక్షల్లో జీతాన్నిచ్చే ఉద్యోగాల్ని తెచ్చిపెట్టింది. కానీ వాటిని వదులుకొని తల్లిదండ్రుల ఆశయాన్నే ముందుకు తీసుకువెళ్లాలనుకుందీ విశాఖపట్నం అమ్మాయి.
పాతికేళ్ల క్రితం రాజమహేంద్రవరంలో జమీల్యా అమ్మానాన్నలైన ఆకుల చలపతి, పార్వతి ఒక చిన్న నర్సరీని మొదలుపెట్టారు. ఆ తర్వాత విశాఖకు వచ్చి రెండెకరాల్లో కళాగ్రామాన్ని ప్రారంభించారు. ఆపై స్థానిక రైతుల నుంచి కొంత భూమిని లీజుకు తీసుకుని.. ఈ గ్రామాన్ని విస్తరించారు. ఆ వారసత్వాన్ని అందిపుచ్చుకొని.. జమీల్యా ఆ భూమిలో ప్రకృతి జీవనంపై ఆసక్తిని పెంచే ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు.
వీటిల్లో ఎక్కువ భాగం అమెరికాకు ఎగుమతి అవుతుంటాయి. ఢిల్లీ, ముంబయిల నుంచి ప్రముఖ ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థలు తమకు కావాల్సిన ఆర్గానిక్ దుస్తుల కోసం ఆర్డర్లు ఇస్తుంటాయి. ఇందుకోసం సజీవ అనే వెబ్‌సైట్‌ని ప్రారంభించింది జమీల్యా. ఈ సైట్లో నాటుకోళ్లు, మేక మాంసం వంటివి కూడా కొనుగోలు చేయొచ్చు. ఈ కళా గ్రామంలో 60 మందికిపైగా మహిళలు ఉపాధి పొందుతున్నారు.
బొన్సాయ్ మొదలుకుని ఎన్నో అరుదైన మొక్కలు కూడా కళాగ్రామంలో దొరుకుతాయి. ప్రతి నెలా అయిదు లక్షల కొత్త మొక్కల్ని రైతులకి ఇక్కడ నుంచే సరఫరా చేస్తారు. వాటికి కావాల్సిన మట్టి కుండీలని సైతం ఇక్కడే తయారుచేస్తారు. ఈ నర్సరీ వ్యవహారమంతా జమీల్యా తల్లి పార్వతి చూస్తారు. అవసరమైన వారికి మొక్కల్ని సైతం అద్దెకు ఇస్తారు.