Photos : తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్ర్య దినోత్సవ చిత్రాలు

73rd Independence Day 2019 : వేడుకలు జరుపుకోవడంలో తెలుగు రాష్ట్రాలది ప్రత్యేక శైలి. ముఖ్యంగా దేశభక్తిని పెంపొందించే స్వాతంత్ర్య దినోత్సవాన్ని తెలుగు రాష్ట్రాల ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌... గాంధీ స్టేడియంలో మువ్వన్నెల జెండాను ఎగురవేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సీఎం హోదాలో మొదటిసారి స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న జగన్... స్వాతంత్ర్య సమరయోధులు, అమరవీరుల త్యాగాల్ని స్మరించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌... గోల్కొండ కోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన తెలంగాణ సీఎం కేసీఆర్... రాబోయే తరానికి ఆస్తిపాస్తులు ఇస్తే సరిపోవనీ... ఆకుపచ్చని పర్యావరణాన్ని వారసత్వంగా అందించడమే మన కర్తవ్యం కావాలని పిలుపునిచ్చారు.