పూనావాలాల వ్యాపార సంస్థలు... సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, పూనావాలా ఫైనాన్స్ , బిల్తోవెన్ బయాలాజికల్స్, పూనావాలా ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్, విల్లో పూనావాలా గ్రీన్ ఫీల్డ్ ఫామ్, పూనావాలా క్లీన్ ఎనర్జీ, పూనావాలా హాస్పిటాలిటీ అండ్ రియల్ ఎస్టేట్. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (sii) ను 2011 నుంచి అదర్ పూనావాలానే నిర్వహిస్తున్నారు.
ఆయన భార్య నటాషా.. sii ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. అంతేగాక విల్లో పూనావాలా ఫౌండేషన్ కు చైర్ పర్సన్ గా కూడా ఉన్నారు. అంతేగాక .. బ్రిటిష్ ఆసియన్ ట్రస్ట్ చిల్డ్రన్స్ ప్రొటెక్షన్ ఫండ్ ఫర్ ఇండియా కు కూడా నటాషా చైర్ పర్సన్ గా పనిచేస్తున్నారు. ఈ కుటుంబానికి పదుల సంఖ్యలో లగ్జరీ కార్లు, విలాసవంతమైన భవనాలు, రోల్స్ రాయిస్ కార్లు ఉన్నాయి. నటాషా తో పాటు అదర్ కు కూడా బాలీవుడ్ సెలబ్రిటీలు, వారి కుటుంబాలతో మంచి పరిచయాలున్నాయి. (image credits Twitter)