3 Years of Covid : అది డిసెంబర్, 2019. చైనా.. వుహాన్ నగరంలోని ఓ నర్స్.. సీనియర్ డాక్టర్‌కి కాల్ చేసి.. ఏదో కొత్త వైరస్ లా ఉందని చెప్పింది. అలా మొదలైన అన్వేషణ.. కొన్ని రోజుల్లోనే కలకలం రేపింది. ఆ కొత్త వైరస్.. వుహాన్ లోని చాలా మందికి సోకుతున్న విషయం అర్థమైంది. అధికారుల అలర్ట్ జారీ అయ్యింది. అదే కరోనా వైరస్. సింపుల్‌గానే వదిలిపోతుంది అనుకుంటే.. ప్రపంచానికి పీడకలలా మారింది. మూడేళ్లైనా వదల్లేదు. ఎప్పటికి పోతుందో తెలీదు. ఇండియాలో బుధవారం తీవ్ర కలకలం రేగింది. చైనాలో కోవిడ్ మరణాల సంఖ్య పెరుగుతుందనే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ.. రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. (Image: News18 Creative)
ఎకానమిస్ట్ జర్నల్ ప్రకారం... చైనాలోని 60 శాతం మంది కరోనా బారిన పడే ప్రమాదం ఉందని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఫెంగ్ జిజియాన్ అంచనా వేశారు. 60 శాతం మంది అంటే.. 84 కోట్ల మంది. అంతమందికి వైరస్ సోకితే ఇంకేమన్నా ఉందా.. కొత్త వేరియంట్లు పుట్టగలవు. (Image: News18 Creative)
చైనా జీరో కోవిడ్ పాలసీని ఇప్పుడు ఎత్తివేయడాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలోని అంటువ్యాధుల విభాగం ప్రొఫెసర్ జెన్మింగ్ చెన్ తప్పుపట్టారు. ఎందుకంటే చైనాలో ఇప్పుడు న్యూఇయర్ వేడుకలు జరుగుతాయి. పెద్ద ఎత్తున ప్రజలు ప్రయాణాలు చేస్తారు. ఫలితంగా దేశమంతా కరోనా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. (Image: News18 Creative)
ప్రస్తుతం చైనా నిజాలు చెప్పట్లేదనీ, మరణాలపై తప్పుడు లెక్కలు చెబుతోందని ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. చైనాకి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కరోనా పేషెంట్లను నేలపై పడుకోబెట్టి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ గమనించిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో అలర్ట్ ఉంది. (Image: News18 Creative)