New Traffic Rule: బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక.. మీరు వాహనం నడిపేటప్పుడు ఇవి ధరించకపోతే భారీ జరిమానా.. ఏంటో తెలుసుకోండి..
New Traffic Rule: బైక్, స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక.. మీరు వాహనం నడిపేటప్పుడు ఇవి ధరించకపోతే భారీ జరిమానా.. ఏంటో తెలుసుకోండి..
New Traffic Rule: బైక్ బయటకు తీసిన మొదలు హెల్మెట్, ఆర్సీ, పొల్యుషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయో లేవో చూస్తాం. ఆ తర్వాత బండిని స్టార్ట్ చేసి బయలుదేరుతాము. కానీ వాహనం నడిపే వ్యక్తి అవి తప్పకుండా ధరించాలి. లేకపోతే మన జేబుకు చిల్లుపడినట్లే.. అసలు విషయం ఏంటంటే..
సాధారణంగా ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ లేకపోతే జరిమానా విధిస్తారు. అయితే వాహనానికి సంబంధించి ఆర్సీ, లైసెన్స్, పొల్యూషన్ ఇవన్నీ కూడా ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 9
వీటితో పాటు వాహనదారుడు కచ్చితంగా షూ వేసుకొని బైక్ నడపాలని లేదంటే రూ.1000 జరిమానా కట్టాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు తెలుపుతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 9
2019లో మోటార్ వాహనాల చట్టాన్ని సవరించిన కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని టార్గెట్ పెట్టుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 9
మోటార్ వాహనాల చట్టం ప్రకారం పాదాలు కనపడేటట్లు చెప్పులు ధరించి బైక్ నడపడం నేరమని ఈ చట్టం చెబుతోంది . ఈ రూల్ ఎప్పటి నుంచో ఉన్నా.. అమలుకు నోచుకోలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 9
చాలామంది చెప్పులు వేసుకొని బైక్ నడుపుతారు. ముఖ్యంగా పల్లటూర్లో దాదాపు చెప్పులు వేసుకొని వాహనాన్ని నడుపుతారు. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 9
అయితే ఇలా చేయడం నేరమని వాహన చట్టం చెబుతోంది. చెప్పులకు తగినంత పటుత్వం ఉండదు. కాబట్టి బైక్ గేర్ మార్చేటప్పుడు ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 9
రద్దీగా ఉండే ప్రదేశాల్లో వెంటనే గేర్ మార్చకపోయినా, ఏదైనా తప్పిదం జరిగినా వెంటనే ప్రమాదం జరగొచ్చు. అనుకోకుండా కింద పడితే పాదాలకు చెప్పులు సేఫ్టీ ఇవ్వలేవు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 9
ఫలితంగా గాయాలు అవుతాయి. బైక్ రైడింగ్ చేసేటప్పుడు చేతికి గ్లౌజులు, ఇతరత్రా వస్తులు ధరించకపోయినా ఫర్వాలేదు. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 9
కానీ క్వాలిటీ హెల్మెట్, షూ తప్పనిసరి అని నిబంధనలు చెబుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)