టూర్ ప్యాకేజీలో బుర్జ్ ఖలీఫాతో పాటు మీరు... మ్యూజికల్ ఫౌంటెన్ షో, డెసర్ట్ సఫారీ, దుబాయ్‌లోని అనేక ప్రధాన మాల్స్, డోవ్ క్రూయిస్ టూర్, అబుదాబి సిటీ టూర్, ఫెరారీ వరల్డ్‌లను సందర్శించే అవకాశాన్ని పొందుతారు." width="1200" height="800" /> IRCTC టూర్ ప్యాకేజీలో బుర్జ్ ఖలీఫాతో పాటు మీరు... మ్యూజికల్ ఫౌంటెన్ షో, డెసర్ట్ సఫారీ, దుబాయ్‌లోని అనేక ప్రధాన మాల్స్, డోవ్ క్రూయిస్ టూర్, అబుదాబి సిటీ టూర్, ఫెరారీ వరల్డ్‌లను సందర్శించే అవకాశాన్ని పొందుతారు.
ఉత్తరప్రదేశ్ .. లక్నో నుంచి మొదలవుతుంది. అక్కడ నుంచి మిమ్మల్ని నేరుగా విమానంలో దుబాయ్‌కి తీసుకువెళతారు. ఈ టూర్ వ్యవధి 5 పగళ్లు, 4 రాత్రులు. మార్చి 11 నుంచి మార్చి 15 వరకు యాత్ర ఉంటుంది. ఈ ప్యాకేజీ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం." width="2523" height="1833" /> IRCTC... దుబాయ్ టూర్ కోసం ఎయిర్ టూర్ ప్యాకేజీలను ప్రారంభించింది. ఈ యాత్ర... ఉత్తరప్రదేశ్.. లక్నో నుంచి మొదలవుతుంది. అక్కడ నుంచి మిమ్మల్ని నేరుగా విమానంలో దుబాయ్‌కి తీసుకువెళతారు. ఈ టూర్ వ్యవధి 5 పగళ్లు, 4 రాత్రులు. మార్చి 11 నుంచి మార్చి 15 వరకు యాత్ర ఉంటుంది. ఈ ప్యాకేజీ ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
IRCTC ఈ టూర్ ప్యాకేజీలో దుబాయ్‌కి వెళ్లి, రావడానికి రౌండ్ ట్రిప్ విమాన టిక్కెట్లతో పాటు... త్రీస్టార్ హోటల్ వసతి మీ కోసం ఏర్పాటు చేస్తారు. ఇది కాకుండా, ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఈ ప్యాకేజీలో ఉన్నాయి. భారతదేశం నుంచి ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు దుబాయ్ సందర్శిస్తారు. మీరు బుర్జ్ ఖలీఫాను చూడాలనుకుంటే, ఎడారి సఫారీని ఆస్వాదించాలనుకుంటే.. ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.
ఈ టూర్ ప్యాకేజీని ఇద్దరు లేదా ముగ్గురి కోసం బుక్ చేసుకుంటే ఒక్కొక్కరికి రూ.85,100 ఉంటుంది. ఒంటరిగా ప్రయాణించాలని ప్లాన్ చేసుకుంటే మీరు రూ.1,01,800 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో పిల్లలకు రూ.84,400గా నిర్ణయించారు. మీరు IRCTC కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా లేదా అధికారిక వెబ్సైట్ (https://www.irctctourism.com) ద్వారా ఆన్లైన్లో ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవచ్చు.