ఊటీ - హనీమూన్ డెస్టినీ: ఈ వాలెంటైన్స్ డే సెలబ్రేషన్స్ కోసం ఊటీకి వెళ్లండి. బొటనికల్ గార్డెన్స్, శిఖరాలు, సరస్సులు, జలపాతాలు, ఫ్లవర్ షో లాంటి ఆహ్లదకరమైన స్పాట్స్‌కు ఊటి పార్టనర్‌తో ఊటీ ప్లాన్ చేయండి. Image Source /traveltriangle.comఅడ్డా. ఈ ప్రాంతాన్ని రోడ్డు, రైలు ద్వారా ఈజీగా చేరుకోవచ్చు. ఊటీకి సమీపంలో కోయంబత్తూర్ విమానాశ్రయం ఉంది. ఊటీలో వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లదకరంగా ఉంటుంది.Image Source /traveltriangle.com
శివనసముద్ర - అద్భుతమైన జలపాతాలకు నిలయం: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉన్న శివనసముద్ర.. కావేరీ నది ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం. ప్రేమికుల రోజు వేడుకలకు హాట్ స్పాట్. జలపాతాలు, పురాతన ఆలయాలకు ప్రసిద్ధి చెందిన శివనసముద్ర.. ఆసియాలోని మొదటి జలవిద్యుత్ కేంద్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. Image Source /traveltriangle.com
వట్టకనాల్- తమిళనాడు: పై ఫోటో చూసి ప్రేమలో పడ్డారా? అయితే మీరు పట్టకనాల్ను విజిట్ చేస్తే.. ఈ ఫోటో చూసిన అనుభుతి కంటే ఎన్నో రెట్ల ఆనందం కలుగుతుంది. 'లిటిల్ ఇజ్రాయెల్'గా పిలిచే వట్టకనాల్ తన ఆకర్షణతో మిమ్మల్ని స్వర్గానికి తీసుకువెళ్లుతుంది. ఈ వాలెంటైన్స్ డేను ఒకరికొకరు ఏకంతంగా గడపాలనుకుంటున్నారా? అయితే వట్టకనాల్కు తప్పక వెళ్లండి. దట్టమైన అడవులు, కొండలు, గుట్టల మధ్య విహరించాలని ఉంటే.. వట్టకనాల్కు వెళ్లాల్సిందే. Image Source /traveltriangle.com
మరవంతే- కర్ణాటక: ప్రశాంతమైన వాతావరణంలో సేదతీరాలనుకుంటున్నారా..? అయితే మరవంతేకు మీ లవర్‌తో వెళ్లిపోండిది. ఇక్కడ బీచ్‌లు ఎంతో అట్రాక్షన్. ఉడుపి జిల్లాలో ఉన్న ఈ ప్లేస్ టూరిస్టులతో పాటు లవర్స్ కూడా ఇష్ట పడే ప్లేస్. ఉడుపికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరవంతేకు వెళ్లే టూరిస్టులు కోడి బీచ్ తప్పకుండా చూడాల్సిందే. Image Source /traveltriangle.com
గండికోట - ఇండియన్ గ్రాండ్ కేనియన్: దేశంలో వాలెంటైన్స్ డే సందర్భంగా సందర్శించవలసిన అత్యంత ఏకాంత ప్రదేశాలలో ఒకటి గండికోట. పెన్నార్ నది ఒడ్డున ఉన్న ఇక్కడి లోయ పురాతన కాలంలో గండికోటను పరిపాలించిన శక్తివంతమైన పెమ్మసాని రాజవంశానికి సాక్షిగా నిలుస్తుంది. ఎర్రమల పర్వత శ్రేణుల చుట్టూ, పెన్నార్ లోయ గుండా ప్రవహిస్తుండడంతో.. ప్రేమికుల రోజున గండికోట అందాలను మీ పార్టెనర్తో కలిసి చూడండి. Image Source /traveltriangle.com
మనాలి : ఇది లవర్స్‌కు, పెళ్లైనా కపుల్స్‌కు ఫేవరెట్ ప్లేస్. హనీమూన్ డెస్టినేషన్ కూడా. మనాలి అందాలను చూడటానికి ఫిబ్రవరినే బెస్ట్. వాలెంటైన్స్ డే కూడా ఫిబ్రవరిలోనే కదా. మీరు ఒకరికొకరు దగ్గర కావడానికి, మళ్లీ ఒకరినొకరు డీప్‌గా ప్రేమించుకోవడానికి ఇక్కడి వాతావరణం చాలా స్వీట్. Image Source /traveltriangle.com
ఉదయ్‌పూర్- రాజస్థాన్: ఈ నగరం అందమైన సరస్సులకి, అధ్బుతమైన కోటలకి, శిల్ప చిత్రకళా విశేషలకు ఫేమస్. వెనీస్ ఆఫ్ ద ఈస్ట్..అని కశ్మీర్ ఆఫ్ రాజస్థాన్ అని ఉదయ్‌పూర్‌ని పిలుస్తారు. ఉదయ్‌పూర్ కొత్తజంటలకు హనీమూన్ స్పాట్ కూడా. పిచోలా సరస్సు, సిటీ ప్యాలెస్, జగదీశ్వరాలయం ఇలా ఒకటేమిటి.. మీ పార్టెనర్తో వెళ్లడానికి ఇదే మంచి స్పాట్. Image Source /traveltriangle.com
ఆగ్రా: ప్రేమకు ప్రతీక అయిన ఆగ్రా నగరాన్ని ప్రతి ప్రేమికుడు, పెళ్లైన జంటలు సందర్శించుకోవాలనుకుంటారు. ప్రపంచ ప్రఖ్యాతి తాజ్‌మహల్ అందమైన ఆర్కిటెక్చర్‌ను చూస్తునే రోజంతా గడపవచ్చు. ఆగ్రా కోట, కీతం సరస్సు, రామ్ బాగ్, మెహతాభ్ బాగ్ వంటిని చూసి ఎంజాయ్ చేయాలంటే కచ్చితంగా ఆగ్రా వెళ్లాల్సిందే. Image Source /traveltriangle.com