మొదటి విధానం : ఇజ్రాయెల్ మొదటి విధానం వెనుక ఉన్న ఆలోచన ఏమిటంటే, అవసరమైనప్పుడు సైనికుల కొరత ఎప్పుడూ ఉండకూడదు. దేశంలోని ప్రతి ఒక్కరూ సైన్యంలో పనిచేయవలసి ఉంటుంది. అయితే, ప్రజలు రెండు విధాలుగా సైన్యంలో చేరతారు. ఒకరు బలవంతంగా సైన్యంలో చేరడం.. మరొకరు నిర్ణీత శిక్షణ కోసం స్వచ్ఛందంగా వెళ్లడం. ఈ విధంగా, ఇజ్రాయెల్ యొక్క పెద్ద జనాభా సైనిక శిక్షణలో నైపుణ్యం కలిగి ఉంది. వారు ఎప్పుడైనా సైన్యానికి సహకరించవచ్చు.
రెండవ విధానవం: ఇజ్రాయెల్ తన సైన్యానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోకూడదని తీర్మానం చేసుకుంది. ఈ విధానం ద్వారా.. ఇజ్రాయెల్ ప్రజలు సాంకేతికత నుంచి యుద్ధం వరకు ప్రతి ఫ్రంట్లో భిన్నంగా కనిపిస్తారు. కొన్ని దశాబ్దాలలో ఇజ్రాయెల్ ఆర్థిక శక్తి నుంచి సైనిక శక్తి వరకు తనను తాను శక్తివంతంగా నిరూపించుకుంది.
ఐదవ విధానం : ఇజ్రాయెల్ యుద్ధంలో పాల్గొనడానికి ఎప్పుడూ తొందరపాటు నిర్ణయం తీసుకోదు. కానీ తన బలగాలను అన్ని వ్యూహాలను రచిస్తుంది. ఏ దేశమైనా దాడికి దిగితే.. సరియైన సమాధానం ఇవ్వడానికి వెనుకాడదు. కానీ ఇప్పటివరకు ఇజ్రాయెల్ దేశం అనవసరంగా ఎటువంటి దాడిలో పాల్గొనలేదు. అయితే, ఇరాన్ మాత్రం పరోక్ష దాడులకు పాల్పడిందని ఆరోపిస్తోంది.