‘గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినందుకు నీకు శుభాకాంక్షలు రాజా.. బుడిబుడి అడుగులతో నా చేతుల్లో పెరిగిన నువ్వు.. ఇవాళ ఇంత గొప్ప వ్యక్తిగా ఎదిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది.నిజాయితీ,దయతో కూడి ఉండు. నీ చుట్టూ ఉన్నవారిని గౌరవించు.. ఆ దేవుడి కృప నీకు ఉంటుంది. ఎంతోమంది దీవెనలు నువ్వు అందుకుంటావు..చాలా గర్వంగా ఉంది నాన్న..’ అని షర్మిల ట్వీట్ చేశారు.
వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డిని అభినందించడానికి కూతురు అంజలి రెడ్డి కూడా వెంట వెళ్లింది. కొడుకు, కూతురు, తల్లి, భర్తలతో డల్లాస్ వర్సిటీలో వైఎస్ షర్మిల దిగిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. రాజారెడ్డిని పలువురు అభినందిస్తున్నారు. అయితే మేనమామ వైఎస్ జగన్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం రాలేదింకా.