Love Marriage: అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి ..పెళ్లి వరకు తీసుకొచ్చిన పవిత్ర ప్రేమ
Love Marriage: అక్కడ అమ్మాయి..ఇక్కడ అబ్బాయి ..పెళ్లి వరకు తీసుకొచ్చిన పవిత్ర ప్రేమ
Love Marriage:గొల్లపల్లి గ్రామానికి చెందిన వరుడు రవికుమార్ ఆరేళ్ల క్రితం మయన్మార్‌కు వెళ్లాడు. మయన్మార్‌లోని జిన్ న్వేథేన్ దోహా నగరంలోని ఓ హోటల్ మేనేజ్మెంట్లో పని చేస్తుండగా కేథరిన్‌తో పరిచయం ఏర్పడింది. ఆమెను చేయి పట్టుకొని ఇండియాకు తెచ్చేలా వారిద్దరి మధ్య ప్రేమ నడిపించింది.
ఇక్కడ అబ్బాయి..అక్కడ అమ్మాయి. ఇది సినిమా టైటిల్ కాదు. ప్రేమికుల రోజుకు ముందు ఇచ్చే కొటేషన్ అంతకన్నా కాదు. ఉద్యోగ వేటలో భాగంగా తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం చింతగూడకు చెందిన రవికుమార్ ఉద్యోగ వేటలో భాగంగా ఖతార్ దేశానికి వెళ్లాడు.
2/ 7
మయన్మార్‌లో హోటల్ మేనేజ్మెంట్ చేస్తూ తనకు అక్కడ పరిచయమైన కేథరిన్ అనే యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరి మనసులు ఒకటవడంతో ఇద్దరి మధ్య ప్రేమ ముదిరి పాకాన పడింది. అంతే తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దల చెవిన పడేశారు. ఎల్లలు దాటిన ఈ ప్రేమికుల వివాహానికి వారు కూడా అడ్డు చెప్పకుండా పచ్చ జెండా ఊపారు.
3/ 7
దీంతో ఫిబ్రవరి 6వ తేది సోమవారం ఉదయం 11.35నిమిషాలకు క్రైస్తవ సంప్రదాయ పద్దతిలో సెయింట్ థామస్ చర్చ్‌లో ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో గ్రాండ్‌గా జరిగిన వీరి ప్రేమ పెళ్లి విషయం ఇప్పుడు స్థానికంగానే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయింది.
4/ 7
గొల్లపల్లి గ్రామానికి చెందిన వరుడు రవికుమార్ ఆరేళ్ల క్రితం మయన్మార్‌కు వెళ్లాడు. మయన్మార్‌లోని జిన్ న్వేథేన్ దోహా నగరంలోని ఓ హోటల్ మేనేజ్మెంట్లో పని చేస్తుండగా కేథరిన్‌తో పరిచయం ఏర్పడింది.
5/ 7
ఒకేచోట కలిసి ఉద్యోగం చేస్తున్న వీరిద్దరికి కలిసి జీవించాలని భావించారు. అందులో భాగంగానే తాము ప్రేమించుకున్నామని..పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని ఇరువర్గాల పెద్దలకు చెప్పారు.
6/ 7
ప్రేమ రెండు మనసుల్నే కాదు ఖండాంతరాల అవతల ఉన్న ఇద్దరు వ్యక్తులను కూడా కలుపుతుందని రవికుమార్ తల్లిదండ్రులు నమ్మలేకపోయారు. అయినా బిడ్డ సంతోషం కోసం ప్రేమ వివాహాన్ని దగ్గరుండి జరిపించారు.
7/ 7
ఆదిలాబాద్ జిల్లా చింతగూడ గ్రామానికి చెందిన రవికుమార్ ప్రేమ వివాహం కేథరిన్‌తో చింతగూడలోని చర్చిలో క్రైస్తవ మతపెద్దలు, బంధు, మిత్రుల సమక్షంలో గ్రాండ్‌గా జరిపింది. ఈ వివాహానికి అమ్మాయి తరపున ఆమె సోదరుడు మాత్రమే హాజరయ్యాడు.