Yadadri Temple : రాత్రిపూట స్వర్ణదేవాలయంగా యాదాద్రి... ప్రత్యేక లైటింగ్‌తో కొత్త కళ..! ఇవిగో ఫోటోలు..
Yadadri Temple : రాత్రిపూట స్వర్ణదేవాలయంగా యాదాద్రి... ప్రత్యేక లైటింగ్‌తో కొత్త కళ..! ఇవిగో ఫోటోలు..
Yadadri Temple : యాదాద్రి కొత్త శోభను సంతరించుకుంది.. ప్రధాన ఆలయానికి విద్యుత్ కాంతులను అమర్చిన అధికారులు, వాటిని
ట్రయల్ రన్ చేశారు...దీంతో ఆలయం రాత్రిపూట బంగారు వర్ణం కాంతులతో స్వర్ణదేవాలయంగా కనిపిస్తోంది..
దీంతో పాటుఆలయాన్ని మరిన్ని హంగులతో తీర్చేదిద్దేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
1/ 4
యాదాద్రి దేవాలయం రోజురోజుకు మరిన్ని కొత్త హంగులను అమర్చుకుంటుంది.. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆలోచనలతో రూపుదిద్దుకుంటున్న దేవాలయానికి సరికొత్త హంగులు అద్దుతున్నారు.. ఈ నేపథ్యంలోనే యాదాద్రి విద్యుత్ కాంతులను అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి..
2/ 4
ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో ప్రత్యేక లైటింగ్‌ను ఏర్పాటు చేసి, గురువారం రాత్రి ట్రయల్ రన్‌గా నిర్వహించారు. రాత్రిపూట బంగారు వర్ణంతో విద్యుత్ కాంతులు వెదజల్లుతూ... ఆలయ గోపురాలు, మండపాలు స్వర్ణ కాంతులను విరజిమ్మాయి.
3/ 4
కాగా ఆలయంలోని పలు మండపాలకు బెంగళూరుకు చెందిన లైటింగ్ టెక్నాలజీ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేసి లైట్లను అమర్చింది..దీంతో గత మూడు రోజులుగా ట్రైయల్ రన్ కొనసాగుతోంది... లైట్ల వెలుతురులో బంగారు వర్ణములో ఆలయం కనిపిస్తోంది.
4/ 4
కాగా మరికొద్ది రోజుల్లో ఆలయం పూర్తి నిర్మాణాన్ని సంతరించుకుని భక్తులకు అందుబాటులో వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కానున్నాయి..