Yadadri : రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా దంచి కొడుతున్న వానలకు నిర్మాణంలో ఉన్న యాదాద్రి గుట్ట ఘాట్‌రోడ్డు పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తయ్యారు. రెండవ ఘాట్‌రోడ్డులో ఈ సంఘటన జరగడంతో రోడ్డును బ్లాక్ చేశారు. కొండపైకి వెళ్లే భక్తులను వెళ్లకుండా రాకపోకలు బంద్ చేశారు.
భక్తులకు ఇబ్బంది కలగకుండా మొదటి ఘాట్‌రోడ్డు ద్వారా అనుమతిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా గుట్టపైన నిర్మాణ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే..గుట్ట అభివృద్దిలో భాగంగా గుట్టను బ్లాస్ట్ చేసి రోడ్డును నిర్మించారు.
2/ 4
దీంతో ఎడతెరిపి లేని వర్షాలకు నాణ్యత ప్రమాణాలు సరిగా పాటించకపోవడంతో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో కొండపై రాళ్లు కూలుతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.